మదర్స్ డే స్పెషల్: బైక్స్‌పై నిర్భయంగా అన్ని ప్రదేశాలు తిరిగేస్తున్న అమ్మలు..

నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం.( International Mothers Day ) ఈ సందర్భంగా పిల్లలు తమ తల్లుల సేవల పట్ల కృతజ్ఞతా భావం వ్యక్తం చేస్తున్నారు.

 International Mothers Day Special Mothers Who Are Motorcycling Details, Mother's-TeluguStop.com

అలాగే అమ్మలు అయినా సరే అన్ని రంగాలలో దూసుకుపోతున్నారని గుర్తు చేసుకుంటున్నారు.ముఖ్యంగా మగవారికి దీటుగా నిలుస్తున్న తల్లులను గుర్తు చేసుకుంటున్నారు.

కాగా మగవారు చేసే ఎన్నో పనులను మహిళలు సులభంగా చేస్తున్నారు.వాటిలో బైక్ రైడింగ్ ఒకటని చెప్పవచ్చు.

బైక్‌లపై మగవారు మాత్రమే తిరగగలరనే భావన అబద్ధమని తల్లులు నిరూపిస్తున్నారు.తల్లులైన తర్వాత కూడా బైకులపై నిర్భయంగా పలు ప్రదేశాలను చుట్టేస్తున్నారు వీరు.మరి వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.

1.రైడర్ మేఘా శిసోడియా:

మేఘా ( Megha Sisodia ) ఒక ప్రజ్ఞావంతురాలు.ఆమె వివిధ రంగాలపై మక్కువ కలిగి ఉన్నారు.

రచయిత్రి, వార్డ్‌రోబ్ డిజైనర్, కెరీర్ కౌన్సెలర్, సామాజిక కార్యకర్త, ఫ్యాషన్ అధ్యాపకురాలు, మోటార్‌సైకిలిస్ట్‌గా వివిధ అవతారాలు ఎత్తారు.మేఘా ప్రఖ్యాత డిజైన్ యూనివర్సిటీలకు ఫ్రీలాన్స్ డిజైనర్‌గా, గెస్ట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

విద్య, అవగాహన, పరిశుభ్రత, ఆహారం పరంగా వెనుకబడిన పిల్లల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎన్జీవోలతో కూడా కలిసి పని చేస్తున్నారు.మేఘా గత 6-7 సంవత్సరాలలో 23 భారతీయ రాష్ట్రాలలో 65,000 కిలోమీటర్లు ప్రయాణించారు.

Telugu Latest, Megha Sisodia, Mothers Day, Mothers, Shalini Ranyal-Latest News -

2.రైడర్ మేఘనా హృషికేష్ మాండ్కే:

మేఘనా ( Meghana Hrushikesh Mandke ) బైక్‌పై ప్రయాణించాలనే తపనతో అన్ని భయాలను వదిలేశారు.మాతృత్వం, మోటార్‌సైక్లింగ్‌ను సమతుల్యం చేస్తూ, రాయల్ ఎన్‌ఫీల్డ్ పై తిరిగేస్తున్నారు.పట్టుదల కృషితో మరుపురాని జ్ఞాపకాలను ఏర్పరచుకుంటున్నారు.

Telugu Latest, Megha Sisodia, Mothers Day, Mothers, Shalini Ranyal-Latest News -

3.షాలినీ రన్యాల్:

షాలినీ ( Shalini Ranyal ) తన పిల్లల మద్దతుతో తన రైడింగ్ ప్రయాణాన్ని ప్రారంభించారు.ఆమె వారితో పాటు రైడ్ చేస్తూ గడిపిన క్షణాలను ఎంతో ఎంజాయ్ చేస్తూ లైఫ్ టైమ్‌ మెమరీస్‌ సృష్టించుకున్నారు.ఆమె తనకు, ఇతరులకు సేఫ్ రైడ్ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి తగిన సేఫ్టీ గేర్‌ను ఎంచుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube