రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.బ్యాంకుల దగ్గర ఖాతాదారులు క్లెయిమ్ చేయకుండా ఉండిపోయిన డిపాజిట్లను తగ్గించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
ఈ మేరకు వంద రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.కాగా జూన్ 1 వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుందని వెల్లడించింది.
పదేళ్లుగా ఎలాంటి లావాదేవీలు లేని సేవింగ్స్ మరియు కరెంట్ ఖాతాల్లోని డిపాజిట్లతో పాటు గడువు ముగిసి పదేళ్లు గడిచినా తీసుకోకుండా ఉన్న టర్మ్ డిపాజిట్ల మొత్తాన్ని బ్యాంకులు అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లుగా పరిగణిస్తాయి.ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులు ప్రతి జిల్లా పరిధిలో టాప్ -100 అన్ క్లెయిమ్డ్ డిపాజిట్ల సంబంధీకులను గుర్తించి చెల్లింపులు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటాయని ఆర్బీఐ ప్రకటించింది.







