Bellamkonda Sreenivas: అదేంటి బెల్లంకొండ శ్రీనివాస్ అలా అనేశాడు.. దానికి హిందీ సినిమా ఒక్కటే మార్గం అంటూ?

టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్( Bellamkonda Sreenivas ) గురించి మనందరికీ తెలిసిందే.అల్లుడు శీను సినిమాతో హీరోగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకున్నాడు.

 Bellamkonda Sreenivas Viral Comments On Bollywood-TeluguStop.com

కానీ ఆ తర్వాత ఎక్కువ సినిమాలలో నటించలేకపోయాడు బెల్లంకొండ శ్రీనివాస్.తెలుగులో నటించిన తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా మంచి గుర్తింపుని ఏర్పరచుకున్నాడు.

ఇది ఇలా ఉంటే బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా నటించిన చిత్రం ఛత్రపతి.( Chatrapati ) ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్.

ప్రభాస్ ( Prabhas ) నటించిన ఈ ఛత్రపతి సినిమా అప్పట్లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.ఇకపోతే బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ఛత్రపతి సినిమా విషయానికి వస్తే.

ఈ సినిమా నిన్న అనగా మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమాకు బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందు బెల్లంకొండ శ్రీనివాస్ వరుసగా ఇంటర్వ్యూలకు హాజరైన విషయం తెలిసిందే.అంతేకాకుండా బాలీవుడ్ పై ప్రశంసల వర్షం కురిపించారు.ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.

Telugu Bollywood, Chatrapthi, Prabhas, Rajamouli, Tollywood, Vv Vinayak-Movie

నేను ఇప్పటి వరకు నటించిన తెలుగు సినిమాలను హిందీ ఆడియన్స్‌ ఆదరించారు.వారంతా నా మీద చూపిస్తున్న ప్రేమ అభిమానాలకు కృతజ్ఞతలు.అందుకే పూర్తి స్థాయి సినిమాని అందిచాలనుకున్నాను.

దానికోసం ఛత్రపతి సినిమాను రీమేక్‌ చేశాను.దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులకు దగ్గరవ్వాలని నటీనటులంతా అనుకుంటారు.అలా జరగాలంటే హిందీ సినిమా ఒక్కటే మార్గం.2015లో ఉత్తమ నటుడిగా నేను ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు కూడా గెలుచుకున్నాను.ఇప్పుడు మళ్లీ ఈ సినిమాకు కూడా అందుకుంటానని అనుకుంటున్నాను.

Telugu Bollywood, Chatrapthi, Prabhas, Rajamouli, Tollywood, Vv Vinayak-Movie

టాలీవుడ్‌కు చెందిన ఎంతో మంది నటీనటులు బాలీవుడ్ లో విజయం సాధించారు.అ క్కడ కూడా అభిమానులను సొంతం చేసుకున్నారు.నేనూ అదే ట్రెండ్‌ను కొనసాగిస్తాను అని కొచ్చారు బెల్లంకొండ శ్రీనివాస్.

కాగా ఛత్రపతి సినిమా కంటే ముందు బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన కొన్ని సినిమాలను బాలీవుడ్ లోకి డబ్బింగ్ చేసిన విషయం తెలిసిందే.తన డబ్బింగ్‌ సినిమాలతో అభిమానులను సొంతం చేసుకున్నాడు.

తాజాగా విడుదల అయిన ఛత్రపతి మిశ్రమ ఫలితాలను సొంతం చేసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube