రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలో అతి పురాతనమైన హనుమాన్ విగ్రహ పున ప్రతిష్ట కార్యక్రమం నేటి నుంచి ఘనంగా ప్రారంభించారు.గ్రామంలో అత్యంత ప్రతిష్టత్మాకంగా చేపట్టిన బృహత్తరమైన కార్యక్రమన్నీ వేద పండితుల మంత్ర ఉత్సవాల మధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు.
నేడు శుక్రవారం ఉదయం గణపతి పూజ, పుణ్యావచనం, అంకురార్పణం, అఖండ దీపారాధన, రిత్విక్ వరుణం, మండల దేవతా పూజల అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.నవగ్రహ యోగిని క్షేత్రపాలక సర్వతో భద్ర మండల స్థాపితం మరియు అగ్ని ప్రతిష్టాపన జిలాధివాసం,
మంగళ హారతి, మంత్రపుష్పం మరియు తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు.
నేడు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ప్రారంభం కావడంతో గ్రామ ప్రజలకు హనుమాన్ భక్తులకు మూడు రోజులపాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సామ కవిత తిరుపతిరెడ్డి, హనుమాన్ టెంపుల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు, గ్రామ ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.