టీడీపీ అధినేత చంద్రబాబు ( Chandrababu )పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన రైతు పోరు బాట సభలో వైసీపీ( YCP ) ప్రభుత్వంపై మండిపడ్డారు.నాలుగు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతుందని నిలదీశారు.
చేతకాని దద్దమ్మ ప్రభుత్వం కారణంగానే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శలు చేశారు.రైతులకు పాత గోనెసంచలిచ్చి లంచాలు బొక్కిన ఘనత జగన్( jagan ) ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు.
బాధ్యత విస్మరించిన వ్యక్తికి పరిపాలించే హక్కు లేదని కీలక వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు ఆర్.బి.కె వ్యవస్థ ( RBK system )వల్లే రైతుల అధికంగా నష్టపోతున్నారని కూడా ఈ సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.పరిహారం కోసం ప్రభుత్వంపై పోరాటానికి రైతులంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఐదేళ్ల పాలనలో టీడీపీ ఏం చేసిందో.? వైసీపీ ఏం చేసిందో.? చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.కొనుగోలు చేయని ధాన్యాన్ని తాడేపల్లి ప్యాలెస్ కు తీసుకొస్తానని 72 గంటల డెడ్ లైన్ ఇచ్చినా ముఖ్యమంత్రిలో ఏమాత్రం చరణం లేదని.రైతులు పోరాటానికి సిద్ధం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
రైతు వద్ద ఉన్న ప్రతి ధాన్యం గింజ మద్దతు ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.