ధరణి పోర్టల్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ధరణి పోర్టల్ కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
లక్షలాది మంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు.దీని కారణంగా ప్రజలు నిరాశకు గురి అవుతున్నారన్నారు.
పోర్టల్ కింద దాదాపు పది లక్షల దరఖాస్తులు అధికారుల వద్ద, ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు.దీని బట్టే ధరణి పోర్టల్ సమస్య ఎంత తీవ్రతరంగా మారిందనేది అర్థం అవుతుందని వెల్లడించారు.
చివరకు పాస్ పుస్తకాలలో నమోదైన తప్పులను సరిదిద్దడానికి ఎటువంటి అవకాశం లేదని ఎద్దేవా చేశారు.ధరణిలో నిమిషాల వ్యవధిలో మార్పులు జరుగుతాయని, ఎటువంటి అవినీతి జరగదని చెబుతున్నప్పటికీ అమలులో మాత్రం శూన్యమని విమర్శించారు.
ధరణి పేరుతో రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు.విలువైన భూములను బినామీ, రియల్ ఎస్టేట్ కంపెనీలకు దోచి పెట్టారని ఆరోపించారు.
బీఆర్ఎస్ నేతలు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని తెలిపారు.గులాబీ నేతల కోసమే ధరణి పోర్టల్ తీసుకువచ్చారని విమర్శించారు.







