కృతి శెట్టి …( Kriti Shetty )ఉప్పెన సినిమాతో తెలుగు సినిమా ఎంట్రీ ఇచ్చి తెలుగు హీరోలకు పెద్ద వరం లా కనిపించింది.ఆ సినిమా విజయం సాధించడం తో తెలుగు లో చాల మంది హీరోయిన్స్ కి కాలం చెల్లింది.
లక్కీ హీరోయిన్ అంటూ ఆమెను ఎగబడి మరి కొంత మంది దర్శకులు వారి సినిమాలకు బుక్ చేసుకోవడం మొదలు పెట్టారు.అందరు ఊహించినట్టుగానే ఆమె ఉప్పెన సినిమా తర్వాత వచ్చిన శ్యామ్ సింగరాయ్( Shyam Singharoy ) కూడా పెద్ద విజయం సాధించడం తో అందరి దృష్టి మరోసారి ఆమెపై పడింది.
ఇక ముచ్చట గా మూడో సారి బంగార్రాజు సినిమా లో ఆమె నాగ చైతన్య పక్కన నటించి ఆ చిత్రం కూడా విజయం సాధించడం తో హ్యాట్రిక్ హీరోయిన్ అయ్యిపోయింది.

వరసగా ఆమెను టాలీవుడ్ చిత్రాల్లో ఎంపిక చేస్తూ వచ్చారు.కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఆమె నటిస్తున్న ఒక్క సినిమా కూడా విజయం సాధించడం లేదు.దాంతో అందరు కృతి శెట్టి ని పెట్టుకుంటే పెద్దగా ప్లస్ ఏమి ఉండదు అని డిసైడ్ అయ్యారు.
వారియర్ సినిమా నుంచి కృతి కి కష్టాలు మొదలయ్యాయి.ఆ చిత్రం తో మొదలైన పరాజయాలు, మాచర్ల నియోజక వర్గం( Machera Niyojakavargam ), ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి సినిమాలు అన్ని కూడా ప్లాప్ అవ్వడం తో తాజాగా విడుదల అయినా కస్టడీ పైన ఆమె ఆశలు పెట్టుకుంది.
కానీ ఈ సినిమాకు కూడా మిక్సుడ్ టాక్ వస్తుండటం తో ఆమె కు టాలీవుడ్ లో ఇక మనుగడ కష్టం అని చెప్పచు.

అయితే కస్టడీ సినిమా( Custody Movie ) ప్రమోషన్ టైం లో బంగార్రాజు వంటి సినిమాలో ఇదివరకు నటించి విజయం సాధించింది కాబట్టి ఈ సారి వీరి కాంబో లో వస్తున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అని అంతా భావించారు.కానీ ఇదే ప్రశ్న ఇటీవల ప్రమోషన్స్ సందర్భం గా కృతి శెట్టి ని ఒక జర్నలిస్ట్ అడగ్గా, అందుకు నాకు నాగ చైతన్య( Naga Chaitanya )ఏం హిట్ ఇవ్వలేదు.నేను కష్టపడి చేశాను కాబట్టి ఆ హిట్ దక్కింది అంటూ జర్నలిస్ట్ ప్రశ్నను తోసిపుచ్చే ప్రయత్నం చేసింది.
వారి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక కృతి చేతిలో కేవలం అజయంటే రాండం మోషణం అనే మలయాళ సినిమా తప్ప మరొకటి లేదు.







