హెయిర్ ఫాల్ అనేది అందరూ ఎదుర్కొనే కామన్ సమస్య.కానీ కొందరిలో హెయిర్ ఫాల్( Hair fall ) అనేది చాలా తీవ్రంగా ఉంటుంది.
పైగా హెయిర్ గ్రోత్ ఉండదు.ఇలాంటి వారికి ఊడే జుట్టు ఊడిపోతుంది.
కానీ కొత్త జుట్టు రాదు.దీంతో కొద్ది రోజుల్లోనే కురులు పల్చగా మారతాయి.
మీరు కూడా హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారా.? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ హెర్బల్ హెయిర్ టోనర్ అద్భుతంగా సహాయపడుతుంది.ఈ హెయిర్ టోనర్ ను వారానికి ఒక్కసారి వాడితే జుట్టు రాలడం క్రమంగా తగ్గుముఖం పడుతుంది.అదే సమయంలో మరెన్నో బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెర్బల్ హెయిర్ టోనర్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రెండు గ్లాసుల వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి( Cinnamon powder ), వన్ టేబుల్ స్పూన్ లవంగాల పొడి( Clove powder ), వన్ టేబుల్ స్పూన్ మెంతుల పొడి( Fenugreek powder ), వన్ టేబుల్ స్పూన్ డ్రై రోజ్ మేరీ ఆకులు, అర కప్పు ఎండిన పుదీనా ఆకులు, వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్ వేసి కనీసం పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.
అంతే మన హెర్బల్ హెయిర్ టోనర్ సిద్ధం అయినట్టే.ఈ హెయిర్ టోనర్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.
అనంతరం జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు తయారు చేసుకున్న హెయిర్ టోనర్ ను ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.

గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ( Mild shampoo ) ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ హెయిర్ టోనర్ ను వాడితే జుట్టు రాలమన్న రాలదు.హెయిర్ ఫాల్ సమస్య చాలా ఎఫెక్టివ్ గా కంట్రోల్ అవుతుంది.
అదే సమయంలో హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది.
చుండ్రు సమస్య ఉంటే దూరం అవుతుంది.జుట్టు విరగడం, చిట్లడం వంటి సమస్యలు సైతం తగ్గుముఖం పడతాయి.







