హైదరాబాద్ లంగర్ హౌస్ లో గోనెసంచిలో మృతదేహాం తీవ్ర కలకలం సృష్టించింది.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
మృతుడు అశోక్ గా గుర్తించారు.కాళీమందిర్ ఎన్ఎఫ్ఎస్ఎల్ కాలనీకి చెందిన అన్నా చెల్లెలు మృతదేహాన్ని ఆటోలో తీసుకువచ్చి పడేసినట్లు నిర్ధారించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన లంగర్ హౌస్ పోలీసులు అన్నాచెల్లెలు రాజు, స్వరూపలను అదుపులోకి తీసుకున్నారు.అయితే మద్యానికి బానిసగా మారిన అశోక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు డబ్బులు లేకపోవడంతో అశోక్ మృతదేహాన్ని ముక్కలుగా చేసి గోనెసంచిలో తీసుకువచ్చి పడేసినట్లు గుర్తించారు.