తమ నాయకుడిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్న జనసేనికులకు ఈరోజు విలేకరుల సమావేశం ద్వారా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఒక చిన్న సైజు షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది, తాను సీఎం సీటుపై వెంపర్లాడటం లేదని, వచ్చినపుడు అదే వస్తుందంటూ వేదాంత దొరణి లో చెప్పడం జనసైనికులకు మింగుడు పడటం లేదని తెలుస్తుంది అయితే పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలన్న డిమాండ్ జనసైనికులు కన్నా ఆ రెండు పార్టీల పొత్తు పేటాకుల అవ్వాలని కోరుకుంటున్న కొన్ని పార్టీలు, కొంతమంది వ్యక్తుల సమూహమే పనిగట్టుకుని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తుందని, దీనిని ఇప్పుడే సరి చేయకపోతే క్రమంగా ఒత్తిడి పెంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ను ప్రకటించకపోతే జనసైనికులు అంగీకరించని పరిస్థితి తీసుకొస్తారని గమనించే జన సైనికులకు క్లారిటీ ఇవ్వటం కోసమే ఈ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టుగా తెలుస్తుంది.పవన్ కళ్యాణ్ జన సైనికులకు గొప్ప కావచ్చు కానీ ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నారు.
రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన ఒక నాయకుడికి ముఖ్యమంత్రి పదవి డిమాండ్ చేసే నైతిక అర్హత ఎంతవరకు ఉంటుందన్న ప్రశ్న తర్వాత రోజుల్లో రావచ్చు.అందువల్ల అనవసర డిమాండ్లతో పొత్తు పొడవక ముందే దాన్ని చెడగొట్టే వాతావరణం మంచిది కాదని ఆయన జన సైనికులను మానసికం గా సిద్దం చేయడానికే అలా మాట్లాడినట్లుగా తెలుస్తుంది,, తమకు బలం ఉన్న ఉపయోగ గోదావరి జిల్లాలో, ఉత్తరాంధ్ర జిల్లాలో పోటీ చేసి కనీసం ఒక 40 సీట్లు గెలుచుకుంటే కచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో( Andhra Pradesh ) కూడా హంగు పరిస్థితి వస్తుంది.అప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా సీఎం సీటు నడుచుకుంటూ పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తుంది .అలాంటప్పుడు అధికార పార్టీ వేసిన ఉచ్చులో పడి తమ సామాజిక వర్గము మరియు తమ అభిమాన వర్గం యువత.ఎక్కడ ఇబ్బంది పడుతుందో అన్న అనుమానంతోనే ముందుగా క్లారిటీ ఇచ్చారని తెలుస్తుంది.
అంతేకాకుండా అస్తవ్యస్త పరిపాలన చేస్తున్న వైసీపీ( YCP ) ప్రభుత్వాన్ని గద్దింపడమే తమ మొదటి లక్ష్యమని ,దానికోసం ప్రభావంతమైన పార్టీలన్నింటిలతో కలిసి ఎటువంటి షరతులు లేకుండా పని చేస్తామని చెప్పడం ద్వారా తనకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని ఆయన స్పష్టతనిచ్చినట్టుంది.తాను ఒక కులం కోసం పనిచేయడం లేదని తాను ఉన్నత భావనతో ఆలోచిస్తున్నానని, తనని బలపరిచే వారు కూడా అలాగే ఆలోచించాలని తాను కోరుకుంటున్నాను అని చెప్పడం ద్వారా .తాను కేవలం రాజకీయ నాయకుడినే కాదని ఈ సమాజానికి అవసరమైన ఒక మంచి లీడర్ ని కూడా అని ఆయన ప్రూవ్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది.