మంగళగిరి పార్టీ కార్యాలయం లో మీడియాతో మాట్లాడుతూ మరోసారి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పొత్తుల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.వచ్చే ఎన్నికల్లో పొత్తులతోనే పోటీ చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా అన్ని విపక్ష పార్టీలను కలుపుకు పోతామని పవన్ ప్రకటించాడు.సీఎం పదవి ని( CM Seat ) నేను అడగను అంటూ పవన్ వ్యాఖ్యలు చేశాడు.
అంగీకరించని పార్టీలను గణాంకాలు చూపించి మరీ ఒప్పించి వారితో పొత్తు పెట్టుకుంటామని పవన్ కళ్యాణ్ ప్రకటించాడు.సీట్ల విషయంలో తగ్గకుండా తమకు బలం ఉన్న చోట తప్పనిసరిగా పోటీ చేస్తూ పొత్తులతోనే ముందుకు వెళ్తాం అన్నట్లుగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అయితే ఒప్పించి మరీ పొత్తులతో ముందుకు వెళ్తాం అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పై వైకాపా( YCP ) నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ మరోసారి తన రాజకీయ అసమర్థతను చాటుకుంటున్నాడు అంటూ వైకాపా నాయకులు ఎద్దేవ చేస్తున్నారు.గత ఎన్నికల సమయంలో సొంతంగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు టీడీపీ మరియు బీజేపీ తో కలిసి పోటీ చేసేందుకు ప్రాకులాడుతున్నాడు అంటూ వైకాపా నాయకులు కామెంట్స్ చేస్తున్నారు.

గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు కొందరు వైకాపా నాయకులు గుర్తు చేస్తున్నారు.ఆ సమయంలో పొత్తులు అవసరం లేవు అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు వారిని ఒప్పించి మరీ పొత్తులు పెట్టుకుంటాం.పొత్తలుకు వారిని ఒప్పిస్తాం అంటూ వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ వైకాపా నాయకులు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ని మరియు జనసేన కార్యకర్తలను ప్రశ్నిస్తున్నారు.
కేవలం వైకాపా ను ఓడించడం కోసం పవన్ ఏం చేసేందుకు అయినా సిద్ధం అన్నట్లుగా మాట్లాడటం ఆయన రాజకీయ పరిస్థితికి అద్దం పడుతుంది అంటూ వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.