పలు ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీ రంగంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఈ నెల 21వ తేదిన నగరంలోని SBIT ఇంజనీరింగ్ కాలేజ్ అవరణలో “మెగా జాబ్ మేళా“( Mega Job Mela ) నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ తెలిపారు.
ఈ జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లను పోలీస్ కమిషనర్ ఈరోజు అవిష్కారింవారు.పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ … వంద వరకు ప్రవేటు,కార్పొరేట్ కంపెనీలు రానున్న ఈ జాబ్ మేళాల ద్వారా సుమారు నాలుగు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
ఉత్సాహవంతులైన యువతీ యువకులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకొవాలని పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
అర్హులైన యువతీ యువకులు వారి పూర్తి వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్ లలో ఈనెల 18 వ తేది లోపు స్వయంగా సమర్పించాలని సూచించారు.
దీనికి సంబంధించిన దరఖాస్తు కూడా ఆయా పోలీస్ స్టేషన్ లలో అందుబాటులో వుంటాయని తెలిపారు.జాబ్ మేళా అనంతరం ఉద్యోగాల నియామక వివరాలు తెలియజేయబడుతుందని అన్నారు.
నిరుద్యోగ యువతీ యువకులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతోపోలీస్ శాఖ ఏర్పాటు చేసిన ఈకార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.అనేక కంపెనీలు వస్తున్నందున కనీసం 10 Resume files తయారు చేసుకుని రాగలరని అభ్యర్థులకు మనవి చేశారు.
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్ర బోస్( DCP Subhash Chandra bose ), సీసీఆర్బీ ఏసీపీ వెంకటస్వామి, సిఐ తుమ్మ గోపి, చందర్ (HR) పాల్గొన్నారు.
పూర్తి వివరాల కోసం
RI-CTC Tirupathi – 8712659238, RI-Admin Ravi- 8712659234, RSI-Sateesh-986691934, HR-Chandar- 9000937805 నెంబర్లలో సంప్రదించగలరు
.






