శివ సినిమాల కస్టడీ కూడా గుర్తుండిపోతుంది: డైరెక్టర్ వెంకట్ ప్రభు

అక్కినేని నాగచైతన్య(Nagachaitanya) కృతి శెట్టి (Kriti Shetty) హీరో హీరోయిన్గా డైరెక్టర్ వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందు రాబోతున్న చిత్రం కస్టడీ(Custody) .ఈ సినిమా ఎన్నో అంచనాను నడుమ మే 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

 Custody Of Siva Movies Will Also Be Remembered,,venkat Prabhu, Naga Chaitanya,,-TeluguStop.com

ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఇలా తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం మొత్తం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.

Telugu Actresskriti, Naga Chaitanya, Venkat Prabhu-Movie

ఇక నాగచైతన్య సినిమా భారం మొత్తం తన భుజాలపై వేసుకొని ఈ సినిమాని తెలుగు తమిళ భాషలలో ప్రమోట్ చేస్తూ వస్తున్నారు.ఇక తాజాగా డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వెంకట్ ప్రభు కస్టడీ సినిమా గురించి మాట్లాడుతూ నాగచైతన్య కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిపారు.

నాగార్జునసినీ కెరియర్ లో శివ సినిమా ఎలా గుర్తుండిపోతుందో నాగచైతన్య సినీ కెరియర్ లో కూడా కస్టడీ సినిమా అలా గుర్తుండిపోతుందని వెంకట్ ప్రభు తెలియజేశారు.

Telugu Actresskriti, Naga Chaitanya, Venkat Prabhu-Movie

తెలుగు ఎమోషన్స్ తో ఒక హాలీవుడ్ సినిమా చూసాము అనే భావన ప్రతి ఒకరిలోనూ కస్టడీ సినిమా కలిగిస్తుందని డైరెక్టర్ వెంకట్ ప్రభు తెలియజేశారు.ఇక ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.ఇక ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు.

మొదటిసారి నాగచైతన్య కస్టడీ సినిమా ద్వారా తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మరి ఈ సినిమా నాగచైతన్యకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube