తెలుగు ప్రేక్షకులకు యాంకర్ నటుడు జోగినాయుడు( Jogi Naidu ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదటి టీవీ యాంకర్ గా కెరియర్ ను మొదలుపెట్టిన జోగినాయుడు ఆ తర్వాత నటుడిగా మారారు.
అలా ఒకటి రెండు సినిమాలు కాదు దాదాపుగా 150 కి పైగా సినిమాలలో నటించి మెప్పించారు.ఇక తెలుగులో స్వామి రారా, దృశ్యం, కుమారి 21ఎఫ్, నువ్వలా నేనిలా, గుంటూరు టాకీస్ ఇలా ఎన్నో సినిమాలలో నటించి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు జోగినాయుడు.

ఇతను ఫిమేల్ యాంకర్ ఝాన్సీ( Anchor Jhansi ) ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.కానీ ఆ తర్వాత కొన్ని కారణాల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న జోగి నాయుడు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా పూరి జగన్నాథ్( Puri Jagannadh ) గురించి మాట్లాడుతూ.
ఆయన తక్కువ కెరియర్ లోనే ఎక్కువ సినిమాలు చేశారు.ఆయన సినిమాలు ఎన్ని సినిమాలు చేసినా కూడా వాటిలో నేను నటించింది మాత్రం కేవలం ఒక్క సినిమాలోనే.
అది కూడా ఇడియట్ సినిమాలో ఒక్క సన్నివేషంలో మాత్రమే నటించాను.

ఆయన డైరెక్టర్గా కెరియర్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు నేను చాలా సార్లు ప్రతి ఒక్క సినిమాకు నాకు క్యారెక్టర్ ఇవ్వమని అడిగాను.ఆ రాద్దాము చేద్దామని అనేవారు కానీ ఇప్పటివరకు కూడా ఒక క్యారెక్టర్ కూడా సరిగ్గా ఇచ్చింది లేదు అని తెలిపారు.అందుకు గల కారణం ఏంటి అనేది ఆయనకు మాత్రమే తెలియాలి.
నేను ప్రతి ఒక్క సినిమాకి వెళ్లి ఆయన కలవడం క్యారెక్టర్ ఇవ్వమని అడగడం జరిగింది.మరి ఆయన మనసులో ఎటువంటి ఉద్దేశం ఉంది అనేది తెలియదు కానీ ఒకవేళ ఇవ్వకూడదు అనుకున్నారో ఇచ్చే ఉద్దేశం ఉందో లేదో తెలియదు కానీ ఎన్ని సినిమాలకు అడిగిన ఒక్క సినిమాలో కూడా అవకాశం ఇవ్వలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు జోగి నాయుడు.







