వైరల్: భారతీయ పాటను ఆల‌పించిన ఉజ్బెకిస్తాన్ సింగ‌ర్స్... అవాక్కవుతున్న దేశీ నెటిజన్లు!

ఉజ్బెకిస్తాన్ సింగ‌ర్స్( Uzbekistan Singers ) ఏమిటి, ఇండియన్ పాటని పాడడం ఏమిటని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే.2007లో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ‘భూల్ భుల‌య్య’( Bhool Bhulaiyaa ) మూవీలోని ‘మేరే ధోల్నా’ సాంగ్‌ను ఉజ్బెకిస్తాన్ సింగ‌ర్లు ఆల‌పించిన తీరుని మనం ఇక్కడ పొగడకుండా ఉండలేము.తాజాగా దానికి సంబందించిన వీడియో నెట్టింట తెగ వైర‌ల‌వుతోంది.శ్రేయ ఘోష‌ల్‌, ఎంజీ శ్రీకుమార్ పాడిన ఈ పాట ఇప్ప‌టికీ ఇక్కడ పాపుల‌ర్ ట్రాక్‌ అని చెప్పుకోవచ్చు.

 Uzbekistan Singers Mere Dholna Song Going Viral On Social Media Details, Akshay-TeluguStop.com

ప్ర‌ముఖ మ్యూజిషియ‌న్లు, గాయ‌కులు ఈ పాట‌ను వివిధ సందర్భాలలో ఆల‌పిస్తూ సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన విషయం మనకు తెలిసినదే.

ఐతే అదే పాటను ఇపుడు తాజాగా ఉజ్బెక్ సింగ‌ర్లు స్ప‌ష్ట‌మైన హిందీ ఉచ్ఛార‌ణ‌తో ఈ పాట‌ను పాడ‌టం నెటిజ‌న్ల‌ను అవాక్కయేలా చేస్తోంది.ఉజ్బెకిస్తాన్ కి చెందిన ‘హ‌వ‌స్ గురుహి మ్యూజిక్ బ్యాండ్‌’కు ( Havas Guruhi Music Band ) చెందిన ఇద్దరు సింగ‌ర్లు మన ఇండియన్ సంగీతాన్ని ఎంతో స్ప‌ష్ట‌త‌తో ప‌ల‌క‌డం పట్ల చాలామంది తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ వీడియో నెట్టింట షేర్ చేయ‌గానే పెద్ద‌సంఖ్య‌లో వ్యూస్‌, కామెంట్స్ ల‌భించాయి.

ఇకపోతే ఎంతో ఈజ్‌తో వారు హిందీ వెర్ష‌న్ సాంగ్‌ను స్ప‌ష్టంగా పాడ‌టం ఈ వీడియోలో మనం చూడవచ్చు.ప్ర‌తి నోట్ వారు అద్భుతంగా పలికిన తీరుకి నెటిజన్లు సలాం చేస్తున్నారు.సింగ‌ర్ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం కూడా చ‌క్క‌గా కుదిరిందని, స్టాండింగ్ ఒవేష‌న్ పెర్ఫామెన్స్ ఇచ్చార‌ని నెటిజన్లు ప్రశంస‌లు కురిపిస్తున్నారు.ఇండియాలో వున్నా చాలామంది గాయ‌కుల కంటే మీరు ఈ పాట‌ను ఎంతో అందంగా, హృద్యంగా పాడార‌ని మ‌రో యూజ‌ర్ కామెంట్ చేయడం ఇక్కడ చూడవచ్చు.

మీరు కూడా ఈ వీడియోని ఆస్వాదించండి మరి!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube