వైయస్ వివేకానంద రెడ్డి ( YS Vivekananda Reddy ) హత్య కేసు వచ్చేనెల జూన్ చివరినాటికి విచారణ ముగియనున్న సంగతి తెలిసిందే.ఈ కేసులో చోటు చేసుకుంటున్నా పరిణామాలు ఏపీ రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తున్నాయి.
ముఖ్యంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి( YS Avinash Reddy ) సీబీఐ విచారణ ఎదుర్కోవటం కీలక పరిణామంగా మారింది.అంతే కాదు ఈ కేసులో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావటం తెలిసిందే.
ఇక ఇదే సమయంలో ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని ఏపీ మీడియాలో మొన్నటిదాకా వార్తలు వైరల్ అయ్యాయి.

పరిస్థితి ఇలా ఉంటే ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.ఈ కేసు విచారణ స్టార్ట్ అయిన నాటి నుంచి అనేక సందర్భాలలో సుప్రీంకోర్టును సునీత రెడ్డి( Sunitha Reddy ) ఆశ్రయించటం జరిగింది.కాగా తాజాగా మరోసారి వైయస్ సునీత రెడ్డి.
సుప్రీంకోర్టును ఆశ్రయించారు.విషయంలోకి వెళ్తే గంగిరెడ్డి బెయిల్ రద్దును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేయడం జరిగింది.
ఆ పిటిషన్ లో సాక్షులను బెదిరించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.అయితే ఈ పిటిషన్ పై వచ్చేవారం విచారణ జరిగే అవకాశం ఉంది.







