Aishwarya Rai :ఐశ్వర్య రాయ్ కి ఈ రోజు వరకు ఎంత ఆస్థి ఉందో తెలుసా ?

అందాల తార ఐశ్వర్య రాయ్( Aishwarya Rai ) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.మోడలింగ్ లో కెరియర్ ప్రారంభించి మిస్ యూనివర్స్ గా కిరీటాన్ని అందుకొని, సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఆమె గత 30 ఏళ్లలో 50 కి తక్కువగానే సినిమాల్లో నటించింది.

 Aishwarya Rai Properties-TeluguStop.com

అయినప్పటికీ ఆమె కొన్ని వందల కోట్ల ఆస్తులు సంపాదించడంలో విఫలం కాలేదు.ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకి ఎంత తీసుకుంటుంది, ఆమె ఆస్తిపాస్తులు ఏంటి, ఆమె ఎలాంటి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంది అనే విషయం ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Aishwarya Rai, Aishwarya Rao, Aiswaryarai, Bollywood, Mumbai-Latest News

ఇక విషయంలోకి వెళితే ఐశ్వర్య రాయ్ కి ఈ రోజు వరకి ఉన్న నెట్ వర్త్ 776 కోట్లు.ఆమె సినిమాల ద్వారా కాకుండా బ్రాండ్స్, అడ్వర్టైజ్మెంట్స్ వంటి వాటితో కూడా కోట్ల రూపాయలను వెనకేసారు.అంతే కాదు ఆమె సొంతంగా తన భర్త నుంచి వచ్చిన ఆస్తిపాస్తులు కాకుండానే ఈ ఆస్తిని కూడబెట్టడం విశేషం.ఇక ఆమెకు రెండు విల్లాలు కూడా ఉన్నాయి.

ముంబై( Mumbai )లో 41 కోట్లు అలాగే 21 కోట్లు వెచ్చించి అత్యంత ఖరీదైన రెండు విల్లాలను ఆమె కొనుగోలు చేశారు.ప్రస్తుతం ఒక్కో సినిమాకి పది నుంచి 12 కోట్ల రూపాయల పారితోషకాన్ని అందుకుంటుంది ఐశ్వర్య.

Telugu Aishwarya Rai, Aishwarya Rao, Aiswaryarai, Bollywood, Mumbai-Latest News

అలా సినిమాల నుంచి వచ్చే ఆదాయం కాకుండా కేవలం బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ద్వారానే సంవత్సరానికి దాదాపు 80 నుంచి 90 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందుతుంది.ఇక ఆమె ప్రస్తుతం రొలెస్ రాయిస్ గోస్ట్ అనే కారుని వాడుతుండగా దీని ఖరీదు ఎనిమిది కోట్లు, మరొక కారు రెండున్నర కోట్లతో కొనుగోలు చేయగా దాని పేరు లెక్సెస్, అలాగే ఒకటిన్నర కోట్లతో ఆడి కారు కూడా ఆమె గ్యారేజ్ లో పెట్టుకోగా, 2 ,మెర్సిడెజ్ బెంజ్ కార్లు కూడా ఉన్నాయి.వీటి ధర దాదాపు రెండింటికి కలిపి మూడు కోట్లకు పైగానే ఉంటుంది.ఇక ఈమె సంపాదించిన ఆస్తిపాస్తులే కాకుండా భర్త( Abhishek Bachchan ) ద్వారా కూడా ఆమె కొన్ని వేల కోట్ల ఆస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇక కూతురు ఆరాధ్య పేరు పై కూడా కొన్ని వందల కోట్ల ఆస్తులు కలిగి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube