శ్రీముఖి( Sreemukhi ) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు బుల్లితెరపై ఎనర్జిటిక్ యాంకర్ గా పేరు తెచ్చుకొని ఎక్కడ చూసిన తనదే సై అన్నట్లుగా దూసుకుపోతుంది శ్రీముఖి.ప్రస్తుతం ఏ ఛానల్లో చూసిన అమ్మడి హడావుడి రెట్టింపులో ఉంది.
యాంకర్ గానే కాకుండా నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి.బొద్దుగా ఉన్నప్పటికీ కూడా అందం విషయంలో ఏమాత్రం తగ్గలేదు.
తొలిసారిగా అదుర్స్ షోలో అడుగుపెట్టగా అప్పటినుంచి ఇప్పటివరకు వెనుకకు తిరిగి చూడకుండా ఓ రేంజ్ లో పరుగులు తీసింది.అలా ఆ సమయంలోనే వెండితెరపై కూడా పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.
ఇక నటిగా కూడా శ్రీముఖికి మంచి పేరు వచ్చింది.కేవలం ఒక్క ఛానల్ లోనే కాకుండా అన్ని ఛానల్ లో ఆల్ రౌండర్ గా నిలిచింది ఈ బ్యూటీ.
ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా కూడా సోషల్ మీడియా( Social media )లో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.

నిత్యం తన ఫోటోలతో బాగా సందడి చేస్తుంది.ఒకప్పుడు పద్ధతిగా కనిపించిన శ్రీముఖి రాను రాను తన అందాలను పరిచయం చేసింది.సమయం దొరికితే చాలు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతుంది.
ఇక అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్ తో వెళ్లిన ట్రిప్స్ వీడియోలను, ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.అంతేకాకుండా ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ తో బాగా సరదా పట్టిస్తుంది.

ఇక ఈమధ్య బాగా అందంగా రెడీ అవుతూ ప్రతిరోజు ఫోటోషూట్లు చేయించుకుంటుంది.ఆ ఫోటోలతో కుర్రాళ్లకు గ్లామర్ విందును వడ్డిస్తుంది.శ్రీముఖి అప్పుడప్పుడు నెటిజన్స్ నుండి ట్రోల్స్ కూడా ఎదుర్కొంటుంది.కానీ వాటిని అస్సలు పట్టించుకోదు ఈ బ్యూటీ.వెండితెరపై మరిన్ని అవకాశాలు అందుకోవటం కోసం బాగా ఆరాటపడుతుంది.

ఇదంతా పక్కన పెడితే ఈరోజు శ్రీముఖి 30వ పుట్టినరోజు( Birthday ).దీంతో ఆమె ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫాలోవర్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇక మరి కొంతమంది 30 ఏళ్ళు వచ్చాయి పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అంటూ ప్రశ్నిస్తున్నారు.
అయితే ప్రస్తుతం ఆమె తన స్నేహితురాలితో కలిసి బ్యాంకాక్ వెళ్లినట్లు కనిపించింది.ఇక అక్కడే తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలుస్తుంది.దీంతో తన ఫ్రెండ్ తో సరదాగా గడిపిన క్షణాలను వీడియోల ద్వారా సోషల్ మీడియాలో పంచుకుంటుంది.
అయితే కొందరు శ్రీముఖిని బాగా టార్గెట్ చేస్తూ కనిపించారు.
అదేంటంటే ఆమెకు ఫ్రెండ్షిప్ విలువ తెలియదని.ఫ్రెండ్స్ ని అలా వాడుకొని ఇలా వదిలేస్తుంది అని అంటున్నారు.
ఒకసారి ఒక ఫ్రెండ్ తో కనిపించిన ఆమె మరోసారి ఆ ఫ్రెండ్ తో కనిపించదని.మళ్లీ కొత్త ఫ్రెండ్ తో కనిపిస్తుందని అంటున్నారు.
అయితే గతంలో శ్రీముఖి నిజంగానే తోటి ఆర్టిస్టులతో మంచి ఫ్రెండ్షిప్ బంధాన్ని కొనసాగించింది.కానీ ఇప్పుడు వారితో మళ్ళీ కలిసిన సందర్భాలు లేవు.
అయితే నెటిజన్స్ చేసిన కామెంట్లను చూస్తే మాత్రం నిజంగా శ్రీముఖికి ఫ్రెండ్షిప్ కి విలువ తెలియదని అర్థమవుతుంది.







