ఎవరైనా సరే సెలబ్రెటీలు జనాలకు నచ్చని పనులు చేస్తే కచ్చితంగా విమర్శలకు గురవుతారు.నిజానికి కొంతమంది సెలెబ్రెటీలు కూడా తమపై అందరి దృష్టిపడాలని బాగా అతిగా ప్రవర్తిస్తూ ఉంటారు.
ఇక ఆ అతియే చూసేవాళ్ళకు చాలా చిరాకుగా ఉంటుంది.ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులో ఉండటంతో వారు చేసే అతి తొందరగా బయటపడుతుంది.
అయితే తాజాగా శివ జ్యోతి( Shiva Jyoti ) కూడా అలాగే ప్రవర్తించడంతో ఆమెపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు జనాలు.అయితే ఆమె ఏం చేసిందో ఇప్పుడు చూద్దాం.
శివ జ్యోతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.తీన్మార్ వార్తలు ద్వారా అందరి దృష్టిలో పడి తన పరిచయాన్ని పెంచుకుంది.
అలా ఆ వార్తల ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలను అభిమానులుగా మార్చుకుంది.ఆ గుర్తింపుతోనే రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశం అందుకుంది.
ఇక హౌస్ లో ఉన్నంతకాలం తన మాట తీరుతో, ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంది.

ఇక బిగ్ బాస్ లో అడుగు పెట్టినందుకు బాగా క్రేజ్ సంపాదించుకుంది. బిగ్ బాస్( Big Boss ) తర్వాత బుల్లితెరపై పలు షో లలో సందడి చేసింది.తన భర్తను కూడా అందరికీ పరిచయం చేసింది.
ఇక ఇద్దరు కలిసి పలు షోలల్లో రియల్ కపుల్ గా సందడి చేశారు.శివ జ్యోతిలో కూడా చాలా మార్పులు వచ్చింది.
ముఖ్యంగా తన కట్టు బొట్టు పూర్తిగా మారిపోయింది.ఒకప్పటి పద్ధతిని పూర్తిగా పక్కకు పెట్టేసి గ్లామర్ షోకు అలవాటు పడింది.
అందాలు కనిపించే విధంగా తయారవుతూ అందరిని షాక్ కు గురిచేస్తుంది.తన భర్తతో టిప్స్ అంటూ తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.
అయితే ఒకప్పుడు ఈమెపై అభిమానం చూపించిన వాళ్లంతా ఇప్పుడు బాగా విమర్శిస్తున్నారు.

కారణం ఏంటంటే ఆమెలో వచ్చిన మార్పు.ఆమె గ్లామర్ షో కి అలవాటు పడటంతో ప్రతి ఒక్కరు కామెంట్ చేయడం మొదలుపెట్టారు.మొదట్లో ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉండు అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు.
కానీ శివ జ్యోతి కి సెలబ్రిటీ హోదా రావడంతో అవన్నీ పట్టించుకోకుండా తనకు నచ్చినట్లు ప్రవర్తిస్తుంది.అయితే ఇదంతా పక్కన పెడితే రీసెంట్గా తను చార్మినార్( Charminar ) లో షాపింగ్ చేసినట్లు ఒక వీడియో పంచుకుంది.
అందులో తను రోడ్డుపై సెల్ఫీ వీడియోతో రచ్చ చేస్తూ కనిపించింది.అదే సమయంలో ఒక అమ్మాయిని పిలువగా కొద్ది క్షణాల్లో ఆ అమ్మాయికి ప్రమాదం తప్పినట్లు కనిపించింది.
అయితే ఆ వీడియో చూసిన వాళ్లంతా శివజ్యోతి పై ఫైర్ అవుతున్నారు.

మరి కొంతమంది మేకప్ లేకుంటే ఇంత దరిద్రంగా ఉంటావా అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక ఓ నెటిజన్.ఓ పిచ్చిదానా.
నీ పక్క ఉన్న పిల్ల కొంచెం అయితే సస్తుండే.నీ ఫోన్ గంగల పోను.
నువ్వు నీకోసం ఎప్పుడు బతుకుతావో ఏమో.అన్ని ఆగమాగం పనులు చేస్తున్నావు అంటూ ఫైర్ అయినట్లు కనిపించారు.నిజానికి ఈ మధ్య శివ జ్యోతి తన వీడియోలతో బాగా రచ్చ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే.







