సమాజంలో కొందరు వ్యక్తులు మృగాలకంటే హీనంగా జీవిస్తున్నారు.ప్రస్తుతం ఆడవాళ్లకు రక్షణ అనేది లేకుండా పోయింది.
కామాంధులు మహిళలనే కాకుండా అభం శుభం తెలియని పసి పిల్లలపై కూడా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు.బయట తిరిగే మహిళలకే కాదు ఇంట్లో ఉండే మహిళలకు కూడా రక్షణ కరువైంది.
కూతురిపై ఓ తండ్రి అత్యాచార ప్రయత్నం చేశాడు అంటే ఇంతకంటే దారుణం మరొకటి ఉండదేమో.అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకుందాం.
వివరాల్లోకెళితే.ఒరిస్సా కు చెందిన జయ శ్రీ నాయక్( Jaya Sri Naik ) వివాహం తర్వాత భర్తతో విడిపోయి.మేడ్చల్ జిల్లాలోని కండ్లకోయలో తన 17 ఏళ్ల కూతురితో ఒంటరిగా జీవిస్తోంది.అయితే జయశ్రీకు, పద్మనాభ నాయక్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధం ఏర్పడింది.
గత కొన్ని నెలలుగా ఇద్దరు సహజీవనం చేస్తున్నారు.తల్లితోపాటు కూతురు ఒకటే ఇంట్లో ఉంటుంది.
ఇటీవలే జయశ్రీ ఇంట్లో కూతురిని ఒంటరిగా వదిలి పనిమీద బయటకు వెళ్ళింది.

కాసేపటికి సవతి తండ్రి పద్మనాభ నాయక్( Padmanabha Naik ) పీకల దాకా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు.ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించాడు.ఆ బాలిక ఎన్ని విధాలుగా బ్రతిమాలిన దుర్మార్గుడు వినకుండా అత్యాచారానికి పాల్పడుతూ ఉండడంతో.
తను తాను రక్షించుకోవడం కోసం పక్కనే ఉన్న కర్రతో సవతి తండ్రి పద్మనాభ నాయక్ తలపై కొట్టింది.

పద్మనాభ నాయక్ రక్తపు మడుగులోకి జారి కింద పడిపోయాడు.జయశ్రీ ఇంటికి వచ్చాక సవతి తండ్రి పాల్పడుతున్న అఘాయిత్యం గురించి కూతురు చెప్పింది.వెంటనే తల్లి,కూతుర్లు పద్మనాభ నాయక్ ను ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ పద్మనాభ నాయక్ మృతి చెందాడు.పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ విషయం బయటకు రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.







