నల్లగొండ జిల్లా: జీవశాస్త్రానికి వెన్నెముక అయిన డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని కమ్యూనిస్టు విప్లవకారుడు జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ బహిరంగ లేఖ ద్వారా డిమాండ్ చేశారు.డార్విన్ సిద్ధాంతాన్ని ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల నుంచి తొలగించటం అన్యాయమని,జాతీయ విద్యా పరిశోధన,శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) పాఠ్యపుస్తకాల్లో ఇష్టారాజ్యంగా సిలబస్ ను మార్చేస్తూ పాఠ్యాంశాలను తొలగిస్తున్నారంటూ మండిపడ్డారు.
హేతుబద్ధీకరణ పేరుతో సైన్స్ పాఠాలనే తొలగిస్తారా?అని ప్రధాన మంత్రికి రాసిన లేఖలో కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రశ్నించారు.సిలబస్ అధికంగా ఉన్నందున దాన్ని హేతుబద్ధీకరిస్తున్నామని ఇటీవల 6 తరగతి నుంచి 12వ తరగతి వరకు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) పలు పాఠ్యాంశాలను తొలగిస్తోంది.
అందులో పదో తరగతి సైన్స్ నుంచి డార్విన్ సిద్ధాంతం 11,12 తరగతుల నుంచి మొఘలుల చరిత్ర,గాంధీ హత్య తదితర అధ్యాయాలను తొలగించడం పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు ప్రజాస్వామిక వాదులు నిరసన తెలపాలని కోరారు.జీవ పరిణామ క్రమాన్ని (డార్విన్ సిద్ధాంతం) తొలగించడంపై భారత ప్రభుత్వానికి ప్రధానమంత్రికి, ఎన్సీఈఆర్టీకి,రాసిన బహిరంగ లేఖలో సైన్స్ మూలసూత్రాలను, చరిత్రలో వాస్తవాలను ఎలా మారుస్తారని ప్రశ్నించారు.
అన్ని సబ్జెక్టుల్లో అధికంగా ఉన్న సిలబస్ ను తొలగిస్తున్నామని అబద్ధాలు చెబుతూ ఎన్సీఈఆర్టీ సిలబస్ హేతుబద్ధీకరణ పేరిట అశాస్త్రియ భావాలను ప్రవేశపెడుతున్నారని, విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నందున కేంద్రం కేవలం సిలబస్కు సంబంధించి ఔట్ లైన్ మాత్రమే ఇస్తుందన్నారు.ఎన్సీఈఆర్టీ పదో తరగతి సైన్స్ పుస్తకం నుంచి ఇంగ్లాండ్ కు చెందిన చార్లెస్ డార్విన్ (1809-1882) ప్రతిపాదించిన జీవ పరిణామక్రమం పాఠాన్ని పూర్తిగా తొలగించడం సరైనది కాదని పేర్కొన్నారు.
సిలబస్ హేతుబద్ధీకరణలో భాగంగా దాన్ని తొలగించామని ఆ సంస్థ చెబుతున్నా,ఆ సిద్ధాంతాన్ని పాఠ్యాంశాల నుంచి తొలగించాలని 2018లోనే అప్పటి కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్ డిమాండ్ చేయడం గమనించాలని,ఇదంతా ఆర్ఎస్ఎస్ కుట్రలో భాగమేనని ఆరోపించారు.దేశ భవిష్యత్తు ఎలా ఉండాలన్నది పాఠశాల విద్యా ప్రణాళిక (కరిక్యులమ్) నిర్ణయిస్తుందని, విద్యావేత్తలు, నిపుణులతో కూడిన స్టీరింగ్ కమిటీ దాన్ని నిర్ణయించాలని,సైన్స్కు సంబంధించిన అంశాలను ఎలా తొలగిస్తారని? డార్విన్ సిద్ధాంతాన్ని తొలగించాలని ఏ శాస్త్రవేత్త చెప్పారని? అది తప్పని అన్నారు.
రాజ్యాంగంలో సైన్స్, టెక్నాలజీని అభివృద్ధి చేయాలని ఉందని, అందుకనుగుణంగా విద్యా ప్రణాళికలు రూపొందించాలని,దానికి భిన్నంగా వెళితే దేశ భవిష్యత్తుకు నష్టమని చెప్పారు.ఇష్టమున్నా, లేకున్నా యథార్థాన్ని మార్చడానికి వీల్లేదని అభిప్రాయపడ్డారు.
మహాత్మాగాంధీని తక్కువ చేస్తూ ఆయా అంశాలను తొలగించడమూ మంచిది కాదన్నారు.సైన్స్ నేర్పాలంటే మూల సూత్రాల్లో ఒకటి డార్విన్ సిద్ధాంతమని,జీవం ఎలా పుట్టింది? జంతువులు, మనుషులు ఎలా పుట్టారు తదితర అంశాలను డార్విన్ సిద్దాంతం ప్రస్తావన లేకుండా ఎలా బోధిస్తారు?చరిత్రలో ఏది మంచి? ఏది చెడు? అనే దాన్ని పక్కనబెడితే భారత్ వద్దనుకున్నా వందల సంవత్సరాలు ఈ దేశాన్ని మొఘలులు పాలించడం వాస్తవం.ఉద్దేశపూర్వకంగా పాఠ్యాంశాలను తొలగిస్తే ఎవరూ అంగీకరించరని, నిజం నిప్పులాంటిదని అది దాచేస్తే దాగబోదనే సత్యాన్ని గుర్తు చేసుకోవాలని ఆర్ఎస్ఎస్, బిజెపి మతన్మాద శక్తులకు అనుదినం జన స్వరమై జన హితాన్ని కోరుకునే జాతీయవాది జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న గుర్తు చేశారు.డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని పునరుద్ధరించాలని పాలకులకు విజ్ఞప్తి చేశారు.“డార్విన్ పరిణామ సిద్ధాంతం జీవశాస్త్రానికి వెన్నెముక.అది హైస్కూల్ నుంచి విద్యార్థినీ విద్యార్థులకు బోధించాలి.జీవశాస్త్రంలో దాని అనువర్తనాలు అనేకం.పునరాలోచించి డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని తిరిగి ప్రవేశపెట్టాలి.సిలబస్ ఎక్కువగా ఉన్నదని దానిని తొలగించడం అన్యాయం.
ఈ పరిణామ సిద్ధాంతం లేకుండా కోవిడ్ ను ఎదుర్కోగలిగేవారమా? ఈ సిద్ధాంతం ఏ మతానికి వ్యతిరేకం కాదు.అది వసుధైక కుటుంబ భావన” అని తెలిపారు.
డార్విన్ పరిణామ సిద్ధాంతం అనేక ఆధారాలతో చెప్పబడిందని,ఎలాంటి చర్యలు,సమాలోచనలు చేయకుండా ఇష్టారాజ్యంగా సిలబస్ లోని ముఖ్యాంశాలను తొలగించారని విమర్శించారు.వైరస్ ల మధ్య సంబంధాలు పోలికలను తెలుసుకోవడంతో పాటు కోవిడ్-19 ను ఎదుర్కోవడంలో ఈ సిద్ధాంతం ఎంతో ఉపయోగపడిందని ప్రపంచవ్యాప్తంగా అగ్రసేని సైంటిస్టులు చెబుతున్నారన్నారు.
మోడీ చెప్పిన చప్పట్లు, దీపాలు వెలిగించడం, ఆవు మూత్రం పని చేయలేదని,జీనోమ్ సీక్వెన్సింగ్ ఉపయోగపడిందని కేంద్ర ప్రభుత్వానికి రాసిన బహిరంగ లేఖలో సుభాషన్న గుర్తుచేశారు.పరిణామ సిద్ధాంతానికి, మతానికి మధ్య పంచాయతీ లేదని స్పష్టం చేశారు.
డార్విన్ పరిణామ సిద్ధాంతం జీవశాస్త్రానికి ఒక పెద్ద రహదారి అని, సిలబస్ హేతుబద్ధీకరణ పేరుతో పరిణామ సిద్ధాంత పాఠాన్ని పూర్తిగా తొలగించడం సహేతుకం కాదని నేతాజీ పేర్కొన్నారు.సిలబస్ సమతుల్యత కోసం ఇలా చేశామంటే అంతకంటే హాస్యాస్పదమైన విషయం ఇంకొకటి ఉండదని బోసన్న ఎద్దేవా చేశారు.
ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు పరిణామ సిద్ధాంతాన్ని తిరిగి పాఠ్యపుస్తకాల్లో చేర్చేంత వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని నేతాజీ స్పష్టం చేశారు.సమతుల్యత కోసం అంటూ అసమతుల్యం చేశారని కమ్యూనిస్టు విప్లకారుడు జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 8328277285 విమర్శించారు.“డార్విన్ పరిణామ సిద్ధాంతం జీవశాస్త్రంలో ఒక గొప్ప విజయం.ఏ మత ఛాందసులైతే మొదట దానికి వ్యతిరేకంగా పోరాడారో వారే నేడు దాన్ని అంగీకరించక తప్పలేదు.
సైన్స్ నిజం.దాని పరిధిని పెంచాలే కానీ తగ్గించరాదన్నారు.
అక్రమంగా,అశాస్త్రీయంగా తొలగించబడిన డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని తిరిగి ప్రవేశ పెట్టేంత వరకు వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలను కొనసాగించాలని ప్రజలకు, ప్రజాస్వామిక సంఘాలకు ప్రజాతంత్ర ఉద్యమకారుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 9848540078 పిలుపునిచ్చారు.