నందమూరి నటసింహం బాలకృష్ణ ( Nandamuri Balakrishna ) హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ( Anil Ravipudi ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ”NBK108”. అఖండ, వీరసింహారెడ్డి వంటి రెండు సూపర్ హిట్స్ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా దాదాపు సగం కంటే ఎక్కువ పూర్తి కాగా మిగతా భాగం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.మరి షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా నుండి తాజాగా ఒక అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఇక తాజాగా ఈ సినిమాలో మరో స్టార్ భాగం అయ్యాడు అంటూ మేకర్స్ నుండి అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది.

ఈ సినిమాలో (NBK108) కీ రోల్ కోసం నేషనల్ అవార్డు విన్నర్ అర్జున్ రాంపాల్ ( Arjun Rampal ) ను తీసుకున్నట్టు మేకర్స్ చెబుతూ ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.ఈ సినిమాతో ఈ బాలీవుడ్ స్టార్ టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.దీని గురించి కూడా ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేసారు.దీంతో ఈసినిమాలో స్టార్ క్యాస్ట్ కూడా పెరిగి పోతుంది అనే చెప్పాలి.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal ) హీరోయిన్ గా నటిస్తుండగా.బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల ( Sreeleela ) కనిపిస్తున్న విషయం విదితమే.అలాగే ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.అలాగే ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ అవ్వనుంది.మరి అనిల్-బాలయ్య ఇద్దరు కూడా ప్రస్తుతం సక్సెస్ జోరులో ఉండడంతో మరో హిట్ ఖాయం అంటూ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.







