నడిస్తే డబ్బులు ఇస్తారు తెలుసా? ఎలాగంటే?

మనిషికి నడక ( Walking ) ఎంత మేలు చేకూరుస్తుందో చెప్పడం కష్టం.ఆరోగ్య నిపుణులు కేవలం ఓ మనిషి నడక వలన ఎలాంటి అనారోగ్యం లేకుండా బతకగలుగుతాడు అని చెబుతారంటే ఇక అర్ధం చేసుకోవచ్చు.

 Earn Money By Walking With These Apps Details, Walk-ing, Money, Saving, Latest N-TeluguStop.com

అయినా కూడా మనలో చాలామందికి ఉదయాన్నే లేచి నడవం అంటే చాలా బద్ధకం.దాంతో లేనిపోని రోగాలు వస్తాయి.

ముఖ్యంగా నేటి యువతలో కూడా ఊబకాయం ( Obesity ) వంటి సమస్యలు వస్తున్నాయంటే దానికి కారణం ఇదే.అయితే ఇలాంటి పరిస్థితులలో నడవండి, డబ్బిస్తానంటే ఎవరైనా నడవకుండా వుండగలరా? పోటీ పడి మరీ నడుస్తారు కదూ.

Telugu Earn, Growfitter, Hav Fitness, Latest, Step Set, Ups, Walk-Latest News -

ఇకపోతే, వాకింగ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటారో లేదో తెలియదు గానీ.డబ్బు అయితే సంపాదించవచ్చని కొన్ని అప్లికేషన్లు చెబుతున్నాయి.అవును, మీరు ఎంత ఎక్కువ నడిస్తే అంత డబ్బు తీసుకోండని ఆఫర్ చేస్తున్నాయి కొన్ని సంస్థలు.అయితే ఇందుకు స్మార్ట్ ఫోన్ అవసరం పడుతుంది.అందులో కొన్ని అప్లికేషన్లు డౌన్ లోడ్ చేసుకుంటే మీరు నడుస్తూనే డబ్బు సంపాదించుకోవచ్చు. గ్రో ఫిట్టర్ (Growfitter) అనే యాప్ మీకు ఇలా డబ్బు ఇస్తుంది.

అయితే అది క్యాష్ రూపంలో కాదు.కొన్ని పాయింట్స్ ఇస్తే వాటితో మీరు ఎంచక్కా షాపింగ్ చేసుకోవచ్చు.

Telugu Earn, Growfitter, Hav Fitness, Latest, Step Set, Ups, Walk-Latest News -

దీనికోసం మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని సైన్ ఇన్ అయితే 20 పాయింట్స్, వేరొకిరికి రెఫర్ చేస్తే 15 పాయింట్స్ ను పొందుతారు.వీటితో పాటు మీరు ప్రతిరోజూ 1000 అడుగులు వేస్తే ఒక పాయింట్ వస్తుంది.ఇలా మీరు ఎన్ని వేల అడుగులు వేసి అన్ని పాయింట్ష్ పొందవచ్చు.అదేవిధంగా స్టెప్ సెట్ గో (Step Set Go) అనే యాప్ ద్వారా కూడా డబ్బులు సంపాదించొచ్చు.

దీని ద్వారా ఐపోన్, తదితర బహుమతులు కూడా పొందవచ్చు.భారత్ లోఎక్కువగా దీనినే డౌన్లోడ్ చేసుకుంటున్నారు.తరువాత హావ్ ఫిట్నెస్ (Hav Fitness) అనే ఫుడ్ యాప్ వుంది.ఇప్పుడు నీరు, నిద్ర, శారీరక శ్రమను ట్రాక్ చే్తుంది.

నడిచేటప్పుడు డబ్బు సంపాదించడానికి మంచి యాప్ ఇది.దీని ద్వారా వచ్చిన పాయింట్స్ తో వస్తువులు కొనుగోలు చేయొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube