బెంగళూరు పై చెలరేగిన ముంబై బ్యాటర్లు.. ముంబై ఖాతాలో ఘనవిజయం..!

తాజాగా బెంగుళూరు – ముంబై ( Mumbai Indians )మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై ఘన విజయం సాధించింది.ముంబై బ్యాటర్లు చెలరేగి విధ్వంసక బ్యాటింగ్ చేశారు.సూర్య కుమార్ యాదవ్( Suryakumar Yadav ) ఫుల్ ఫామ్ లో బౌండరీల వర్షం కురిపించాడు.35 బంతుల్లో ఏడు ఫోర్లు, ఆరు సిక్స్ లతో 83 పరుగులు చేయడంతో ఘనవిజయం ముంబై జట్టు ఖాతాలో పడింది.

 Mumbai Indians Beat Royal Challengers Bangalore By Six Wickets , Royal Challenge-TeluguStop.com

మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.కోహ్లీ కేవలం ఒక పరుగు చేసి పెవిలియన్ చేరాడు.

బెంగళూరు జట్టు 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ డుప్లేసెస్ 65 పరుగులు, మాక్స్ వెల్ 68 పరుగులు( Glenn Maxwell ) చేయడంతో ముంబై జట్టు మూడో వికెట్ కోల్పోయిన వాటికి 120 పరుగులు చేసింది.

చివర్లో వచ్చిన దినేష్ కార్తీక్ కాస్త చిలరేగి 18 బంతుల్లో 30 పరుగులు చేయడంతో స్కోర్ 199 కు చేరింది.

లక్ష్య చేదనకు దిగిన ముంబై జట్టు 16.3 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit Sharma ) ఏడు పరుగులకు అవుట్ అయ్యి అభిమానులను నిరాశపరిచాడు.

ఓపెనర్ ఇషాన్ కిషన్ కాస్త దూకుడుగా 21 బంతుల్లో 42 పరుగులు చేశాడు.ఇక సూర్య కుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగి బౌండరీల వర్షం కురిపించాడు.35 బంతుల్లోనే 83 పరుగులు చేశాడు.నేహల్ వధీర 34 బంతుల్లో 52 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

ముంబై జట్టు ఆడిన 11 మ్యాచ్లలో ఆరు మ్యాచ్లు గెలిచి 12 పాయింట్లతో లీగ్ పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి చేరింది.ఇంకా ముంబై జట్టు మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది.దాదాపుగా ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలిచాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube