'గేమ్ ఛేంజర్' క్లైమాక్స్ షూట్ అప్డేట్.. మళ్ళీ షిఫ్ట్ అవుతున్న శంకర్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా అగ్ర డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”గేమ్ ఛేంజర్”(Game Changer).ఆర్ఆర్ఆర్ (RRR) వంటి ఘన విజయం తర్వాత ఈ సినిమా చేస్తుండడంతో చరణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

 Ram Charan Game Changer Movie Update Details, Director Shankar, Ram Charan, Rc15-TeluguStop.com

రాజమౌళి లాంటి డైరెక్టర్ తర్వాత చరణ్ వెంటనే శంకర్ లాంటి మరో అగ్ర డైరెక్టర్ తో పని చేయడం ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతుంది.

అయితే ఈ సినిమా ఈ ఏడాది లోనే రిలీజ్ అవుతుంది అని ఫ్యాన్స్ భావించారు కానీ చూస్తుంటే వచ్చే ఏడాది రిలీజ్ అయ్యేలా కనిపిస్తుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది.దాదాపు షూట్ చివరి దశకు చేరుకుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా షూట్ గురించి డైరెక్టర్ శంకర్ (Director Shankar) ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చాడు.ఈ సినిమా నేటితో క్లైమాక్స్ షూట్ (Game Changer Climax) ముగిసింది అని.రేపటి నుండి కమల్ హాసన్ ఇండియన్ 2 సెట్స్ లో జాయిన్ కాబోతున్నట్టు చెప్పుకొచ్చాడు.

మరి శంకర్ ఇండియన్ 2 (Indian 2) కూడా చేస్తున్న విషయం తెలిసిందే.ఈయన రెండు సినిమాలను షూటింగులను ఏకకాలంలో పూర్తి చేస్తూ వస్తున్నాడు.ఇప్పుడు చరణ్ మూవీ ముగియడంతో వెంటనే కమల్ మూవీకి షిఫ్ట్ అవుతున్నట్టు చెప్పాడు.

మరోవైపు చరణ్ మూవీ టీజర్ కోసం మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.షూట్ చివరికి చేరుకోవడంతో టీజర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చూడాలి మరీ ఈ సినిమా ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో.ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.థమన్ సంగీతం అందిస్తుండగా అంజలి, సునీల్, శ్రీకాంత్ వంటి వారు కీలక రోల్స్ లో నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube