మనలో చాలామంది చిన్న చిన్న విషయాలకు అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు.ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యామని కొందరు ఆత్మహత్య చేసుకుంటే, ఉద్యోగం రాలేదని కొందరు బలవంతంగా తనువులు చాలిస్తుంటారు.మరికొందరుంటారు… వీరు విచిత్రంగా ప్రేమలో విఫలం అయ్యామని సూసైడ్ లు చేసుకుంటుంటారు.ఇక్కడ అవయవాలు అన్ని సరిగా వున్నవారు కూడా చిన్నపాటి కష్టానికి భరించలేక దారుణాలకు పాల్పడుతుంటారు.
కానీ వీరికి భిన్నంగా మరికొందరు దివ్యాంగులు ( Physically Handicapped ) తమ బలహీనతలను పక్కనబెట్టి తమకు ఇష్టమైన రంగంలో కష్టపడుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంటారు.

అవును, రాజస్థాన్ లోని( Rajasthan ) చిత్తోర్‌గఢ్‌లోని నింబహెరా నివాసి గోపాల్ రావత్‌కు( Gopal Rawat ) పుట్టినప్పటి నుంచి రెండు కళ్లూ కనిపించవు. అదే పెద్ద కష్టం అనుకుంటే, కొంతకాలం క్రితమే అతని తల్లిదండ్రులు కూడా మరణించారు.ఆ తర్వాత కుటుంబానికి చెందిన సోదరులు, బంధువులు గోపాల్‌ను ఒంటరిగా వదిలేశారు.
కానీ, గోపాల్ ధైర్యం కోల్పోకుండా 12వ తరగతి చదువు చదివాడు.తనకు వీలు చిక్కిన సమయంలో భజన చేయడం, పాడడం, డప్పులు వాయించడం వంటి పనులు చేసేవాడు.
అందుకే గోపాల్‌ని సత్సంగం అని స్థానికులు అంటారు.

గోపాల్ మధురమైన గాత్రం విని అటుగా వెళ్ళే వాళ్ళు కూడా ఆగి గోపాల్ గానాన్ని ఆస్వాదించడం మొదలు పెడతారు.గోపాల్ తండ్రి పార్థివ్ సింగ్ రావత్ సత్సంగంలో ధోలక్ వాయించే పని చేసేవాడట.గోపాల్ తన చిన్నతనంలో తన తండ్రితో పాటు సత్సంగాలకు కూడా హాజరయ్యేవాడు.
ఈ రకంగా గోపాల్ ఢోలక్ వాయించడం నేర్చుకున్నాడు.కట్ చేస్తే ఈ రోజు గోపాల్ పెద్ద పెద్ద కార్యక్రమాలలో ఢోలక్ మరియు భజన్ పాటలు పాడతాడు.
అతని పాట విని అందరూ ఆశ్చర్యపోతారు.తన గానం వల్ల ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవాలనేది తన కల అని గోపాల్ చెప్పడం హర్షణీయం.