సాధారణంగా చిన్నపిల్లల విషయంలో ఎవరైనా ప్రేమగా వ్యవహరిస్తారనే సంగతి తెలిసిందే.చిన్న పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవడానికి అందరూ ఇష్టపడతారు.
అయితే ఒక నటి భర్త మాత్రం కన్న కొడుకు విషయంలో దారుణంగా వ్యవహరించారు.మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబైలో చోటు చేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతోంది.
బాలీవుడ్( Bollywood ) సీరియళ్లు చూసే ప్రేక్షకులకు చంద్రిక సాహా(Chandrika Saha ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
సావధాన్ ఇండియా : క్రైమ్ అలర్ట్, సీఐడీ, అదాలత్ సీరియల్స్ ద్వారా చంద్రిక సాహా పాపులారిటీని సొంతం చేసుకున్నారు.చంద్రిక సాహాను ఆమె భర్త అబార్షన్ చేయించుకోవాలని కోరగా ఆమె అందుకు అంగీకరించలేదు.పిల్లాడు పుట్టిన తర్వాత కూడా చంద్రిక, ఆమె భర్త్ మధ్య గొడవలు జరుగుతున్నాయి.
పిల్లాడి వల్లే గొడవలు జరుగుతుండటంతో 14 నెలల బాబుపై చంద్రిక భర్త అమానుషంగా వ్యవహరించారు.

శుక్రవారం రోజు ఉదయం చంద్రిక తన భర్తకు బాబును ఆడించాలని సూచించారు.ఆ సమయంలో చంద్రికకు బాబు ఏడుపు వినిపించింది.బిడ్డను బాదిన శబ్దం వినిపించడంతో చంద్రిక కంగారు పడి భర్త, బాబు ఉన్న గదిలోకి వెళ్లారు.
ఆ సమయంలో పిల్లాడి శరీరంపై గాయాలను చూసిన చంద్రిక కంగారు పడి వెంటనే బాబును ఆస్పత్రిలో చేర్చడం జరిగింది.సీసీ టీవీ ఫుటేజీ ద్వారా చంద్రికకు భర్త చేసిన పని తెలిసింది.
14 నెలల బాబును భర్త మూడుసార్లు నేలకు కొట్టడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చంద్రిక భర్తను కఠినంగా శిక్షించాలని నెటిజన్ల నుంచి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.తన భర్త చేసిన పని గురించి చంద్రిక ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
ప్రముఖ నటి భర్త ఈ విధంగా చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.







