తాజాగా పంజాబ్ – కొల్ కత్తా( Punjab – Kolkatta ) మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతూ ఏ జట్టు గెలుస్తుందో చివరి బంతి వరకు ఊహించని పరిస్థితి ఏర్పడింది.కోల్ కత్తా జట్టు ప్లేయర్ రింకూ సింగ్ మరొకసారి జట్టుకు విజయాన్ని అందించాడు.
చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉండగా బౌండరీ తో మ్యాచ్ గెలిపించాడు.ఈ మ్యాచ్ గెలవడంతో ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలిచాయి.
మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.బ్యాటర్లు శిఖర్ ధావన్( Shikhar Dhawan ) 57 పరుగులు, షారుక్ 21 పరుగులు, హర్ ప్రీత్ బార్ 17 పరుగులు చేశారు.
మిగిలిన బ్యాటర్లు చెప్పుకోదగ్గ పరుగులు నమోదు చేయలేదు.

లక్ష్య చేధన కు దిగిన కోల్ కత్తా 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసి విజయం సాధించింది.నితీష్ రాణా( Nitish Rana ) 51 పరుగులు, రస్సెల్ 42 పరుగులు, రింకూ సింగ్ 21 పరుగులు చేశారు.కోల్ కత్తా జట్టు బ్యాటర్లు ఆరంభంలో అదరగొట్టిన తరువాత పంజాబ్ బౌలర్లు కీలక సమయంలో కట్టడి చేశారు.
దాదాపుగా పంజాబ్ జట్టు విజయం సాధిస్తుంది అని అనుకున్నారు.కానీ రస్సెల్ భారీ హిట్టింగ్ చేయడంతో ఒత్తిడి తగ్గింది.ఆఖరి ఓవర్ లో అర్షదీప్ తన బౌలింగ్ తో కట్టడి చేసిన రింకు సింగ్ మాత్రం తనదైన శైలిలో మ్యాచ్ కు విజయం అందించాడు.

పంజాబ్ జట్టు 19వ ఓవర్ లో కాస్త కట్టడి చేసి ఉంటే కోల్ కత్తా జట్టు ఒత్తిడికి లోనై ఉండేది.19 ఓవర్లో ఏకంగా 21 పరుగులు సమర్పించుకోవడం.ఆఖరి ఓవర్లో చివరి బంతికి రింకూ సింగ్ చెలరేగడంతో కోల్ కత్తా విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకొంది.







