నా దృష్టిలో గ్లామర్ అంటే అర్థం ఇదేనన్న సాయిపల్లవి.. ఆ హీరో డ్యాన్స్ ఇష్టమంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సాయిపల్లవి ( Sai Pallavi )తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువగా సినిమాలు చేయడం లేదు.గత సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోని నేపథ్యంలో సాయిపల్లవికి మూవీ ఆఫర్లు తగ్గాయని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి.

 Sai Pallavi Comments About Glamour Details Here Goes Viral In Social Media ,sai-TeluguStop.com

ఈరోజు సాయిపల్లవి పుట్టినరోజు.సాయిపల్లవిది ఊటీకి దగ్గరలో ఉన్న కోటగిరి గ్రామం కాగా చిన్నప్పటి నుంచి సాయిపల్లవికి డ్యాన్స్ పై ఆసక్తి ఉండేది.

నేను, పూజ కవలపిల్లలమని నాకు లెక్కలంటే భయమని మ్యాథ్స్ క్లాస్ నుంచి తప్పించుకోవడానికి ఒక సినిమాలో ఛాన్స్ వస్తే వెంటనే ఓకే చెప్పానని ఆమె తెలిపారు.మీరాజాస్మిన్ ( Meera Jasmine )పక్కన ఒక సినిమాలో చిన్న పాత్రలో కనిపించానని సాయిపల్లవి పేర్కొన్నారు.

ఆ తర్వాత రోజుల్లో సినిమాలకు బ్రేక్ తీసుకుని జార్జియాలో మెడిసిన్ చేశానని ఆమె చెప్పుకొచ్చారు.

ప్రేమమ్ ( Premam )సినిమా స్క్రిప్ట్ నచ్చడంతో ఆ సినిమాలో నటించానని సాయిపల్లవి కామెంట్లు చేశారు.ఆ తర్వాత కలి మూవీలో, ఫిదా మూవీలో ( Fidaa )నటించానని సాయిపల్లవి కామెంట్లు చేశారు.గ్లామర్ అనే పదానికి ఒక్కొక్కరు ఒక్కో అర్థం చెబుతారని మొదట నన్ను ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో అనే భయం వేసిందని ఆమె పేర్కొన్నారు.

నా దృష్టిలో గ్లామర్ అంటే ఎంపిక చేసిన పాత్రల ద్వారా ప్రేక్షకులకు దగ్గర కావడం అని ఆమె తెలిపారు.

సాయిపల్లవి మాట్లాడుతూ నేను మేకప్ వేసుకుంటే నాలా నేను కనిపించనని చాలామంది చెబుతారని చెప్పుకొచ్చారు.అలు అర్జున్ డ్యాన్స్ కు నేను అభిమానినని సాయిపల్లవి కామెంట్లు చేశారు.ఫిదాలోని వచ్చిండే సాంగ్ ను బన్నీ ప్రశంసించడం నాకు సంతోషాన్ని కలిగించిందని ఆమె వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube