తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నటువంటి హీరో విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) నేడు పుట్టినరోజు( Birthday ) వేడుకలను జరుపుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఈయనకు పెద్ద ఎత్తున అభిమానులు సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అయితే గత మూడు రోజులుగా విజయ్ దేవరకొండ పేరు సోషల్ మీడియాలో మారు మోగిపోతుంది.అందుకు గల కారణం ఈయనని ఉద్దేశిస్తూ అనసూయ ( Anasuya ) పరోక్షంగా చేసిన పోస్ట్ ఏ కారణమని చెప్పాలి.
విజయ్ దేవరకొండ నటిస్తున్న ఖుషి( Kushi ) సినిమా నుంచి ఒక పోస్టర్ విడుదల చేయగా అందులో ది విజయ్ దేవరకొండ అని ఉండడంతో అనసూయ ఈ పోస్టర్ పై పరోక్షంగా కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా అనసూయ ఈ పోస్టర్ ను ఉద్దేశించి ది పైత్యం ఏంటో.మనకు అంటకుండా చూసుకోవాలి అంటూ కామెంట్ చేయడంతో విజయ్ దేవరకొండ అభిమానులు పెద్ద ఎత్తున ఈమెను సోషల్ మీడియాలో అనసూయని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.ఈ క్రమంలోనే విజయ్ ఫాన్స్ అనసూయ చేసిన ట్వీట్ పై స్పందిస్తూ నువ్వు కూడా నీ పేరుకు ముందు ది అని పెట్టుకో ఎవరు కాదన్నారు అంటూ పెద్ద ఎత్తున అనసూయని ట్రోల్ చేస్తున్నారు.
ఇకపోతే విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్( Harish Shankar ) సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

అయితే హరీష్ శంకర్ చేసిన ఈ పోస్ట్ కనుక చూస్తే ఈయన అనసూయను టార్గెట్ చేస్తూ ఆమెకు కౌంటర్ ఇస్తూనే పోస్ట్ చేశారని అర్థమవుతుంది.ఇంతకీ విజయ్ దేవరకొండ గురించి శంకర్ సోషల్ మీడియా వేదికగా ఎలాంటి విషెస్ చెబుతూ ట్వీట్ చేశారనే విషయానికి వస్తే.ది కామ్, ది హీరో, ది యాంగర్ కంట్రోల్ ఇలా ది అంటూ విషెస్ చెప్పాడు.
అనసూయకు కౌంటర్లు వేయాలనే ఉద్దేశంలో విజయ్‌కి విషెస్ చెప్పాడో ఏమో గానీ.విజయ్ ట్విట్టర్ హ్యాండిల్‌ని తప్పుగా ట్యాగ్ చేశాడు.ఈ క్రమంలోనే హరీష్ శంకర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ కావడంతో కావాలని తప్పుగా చేసావా అన్న అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు అనసూయకు గట్టి కౌంటర్ ఇచ్చారు అంటూ కామెంట్ చేస్తున్నారు.ప్రస్తుతం హరీష్ శంకర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.







