తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ ( BRS ) ఒకవైపు ఎన్నికల హడావుడిలో నిమగ్నం అయ్యింది.సార్వత్రిక ఎన్నికలకు సమయం కొద్ది నెలలు మాత్రమే ఉండడంతో, మూడోసారి గెలిచేందుకు అన్ని రకాల వ్యూహాలను అమలు చేస్తోంది.
తెలంగాణతో పాటు, మిగతా రాష్ట్రాల్లోనూ పార్టీని విస్తరించే పనుల్లో అధినేత కెసిఆర్( CM KCR ) నిమగ్నమయ్యారు.ఎక్కువగా ఇతర రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే విషయంపై దృష్టి సారిస్తుండడంతో , తెలంగాణలో సొంత పార్టీలో పరిస్థితులు చేజారిపోతున్నాయి .ఇప్పటికే కొంతమంది కీలక నేతలు పార్టీని వీడి వెళ్లడం, వారి కారణంగా రాబోయే ఎన్నికల్లో ప్రభావం తీవ్రంగా ఉండడం వంటివన్నీ కేసిఆర్ కు ఆందోళన కలిగిస్తున్నాయి .

ఇంకా మెజారిటీ సంఖ్యలో కీలక నాయకులు అసంతృప్తితో ఉండడం , పార్టీ మారేందుకు ఇతర పార్టీ నేతలతో సంప్రదింపులు చేస్తూ ఉండడం వంటి అన్ని అంశాల పైన కెసిఆర్ సీరియస్ గా దృష్టి సారించారు.ఈ మేరకు అసంతృప్తి నేతలను బుజ్జగించే విధంగా అన్ని నియోజకవర్గాల్లోని సీనియర్ నేతలను కేసీఆర్ రంగంలోకి దించారు .వారిని చేర్చుకునేందుకు విపక్షాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు.వారిని పార్టీలో చేర్చుకునేందుకు ఏ ఏ హామీలు వారికి ఇస్తున్నాయి అనే అంశాల పైన కెసిఆర్ దృష్టి సారించారు. బిఆర్ఎస్ టార్గెట్ గా విపక్షాలు ఆపరేషన్ ఆకర్ష్ కు( Operation Akarsh ) తెరతీయడంతో ఎవరెవరు పార్టీని వీడే అవకాశం ఉంది అనే అంశాలపై కేసీఆర్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు .

ఇప్పటికే అన్ని జిల్లాల్లోని కీలక నాయకులను పిలిపించుకుని, ఆయా జిల్లాలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, పార్టీకి చెందిన కీలక నేతల పనితీరు, పార్టీ మారేవారు ఎవరెవరు వారికి ఎటువంటి హామీలు విపక్షాల నుంచి వస్తున్నాయి అనే అంశాల పైన ఆరాతీస్తూ ఎవరు పార్టీ మారకుండా చూడాలని కెసిఆర్ ఆదేశించారట.ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీకి దూరం కావడంతో వారి కారణంగా టిఆర్ఎస్ కు జరిగే నష్టం తీవ్రంగానే ఉందని, మిగతా నేతల విషయంలోనూ ఆ విధమైన పరిస్థితి తలెత్తకుండా ముందుగానే కేసీఆర్ అలర్ట్ అవుతూ పార్టీ నేతలను అలెర్ట్ చేస్తున్నారు.







