కస్టడీ ఫస్ట్ రివ్యూ

నాగార్జున కొడుకు అయిన నాగచైతన్య ( Naga Chaitanya ) ఇండస్ట్రీ లోకి జోష్ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసింది.ఇక ఆ సినిమా సరిగా ఆడకపోవడం తో ఏ మాయ చేశావే సినిమా తో మంచి విజయం అందుకున్నాడు…ఇక అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ మంచి విజయాలు అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు…అందులో భాగంగానే నాగచైతన్య, యంగ్ బ్యూటీ కృతి శెట్టి( Krithi Shetty ) జంటగా నటించిన తాజా చిత్రం `క‌స్ట‌డీ`.

 Naga Chaitanya Krithi Shetty Custody Movie First Review Details, Naga Chaitanya,-TeluguStop.com

( Custody Movie ) బంగార్రాజు వంటి హిట్ మూవీ అనంతరం వీరి కాంబోలో రాబోతున్న రెండో సినిమా ఇది.వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పవన్‌కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు.ఇందులో అర‌వింద్ స్వామి విల‌న్ గా చేశాడు.

అలాగే శ‌ర‌త్‌కుమార్‌, ప్రియ‌మ‌ణి, సంపత్ రాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

 Naga Chaitanya Krithi Shetty Custody Movie First Review Details, Naga Chaitanya,-TeluguStop.com

ఇళయరాజా, యువన్ శంకర్ రాజా స్వ‌రాలు అందించాడు.మే 12న ఈ సినిమా తెలుగుతో పాటు త‌మిళంలోనూ విడుద‌ల కాబోతోంది.

క‌స్ట‌డీ త‌న కెరీర్ లోనే బెస్ట్ మూవీ అవుతుంద‌ని నాగ చైత‌న్య ధీమాగా చెబుతున్నాడు.టీజ‌ర్‌, ట్రైల‌ర్లు సినిమాపై భారీ అంచ‌నాల‌ను పెంచేశాయి… మ‌రోవైపు ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో మేక‌ర్స్ మ‌రింత బ‌జ్ క్రియేట్ చేస్తున్నారు.

బిజినెస్ కూడా అదిరిపోయే రేంజ్ లో జ‌రుగుతుంద‌ని అంటున్నారు.ఇలాంటి త‌రుణంలో క‌స్ట‌డీ ఫ‌స్ట్ రివ్యూ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

Telugu Akkineninaga, Aravind Swamy, Review, Venkat Prabhu, Krithi Shetty, Naga C

తాజాగా క‌స్ట‌డీ మొదటి కాపీ ని ప్రసాద్ ల్యాబ్స్ లో కొంతమంది సినీ ప్రముఖుల మధ్య ప్ర‌ద‌ర్శించారు.సినిమా చూసిన వారంద‌రూ చాలా పాజిటివ్ గా స్పందించార‌ట‌.సినిమాలో మొదటి ఇర‌వై నిమిషాలు చాలా కూల్ గా, ప్ల‌జెంట్ గా సాగుతుందట.ఆరంభం నుంచే ప్రేక్షకుడు సినిమాలో లీనం అవుతాడట.అరవింద్ స్వామి ఎంట్రీ తో సినిమా మరో లెవల్ కు వెళుతుందట.నాగచైతన్య తన పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయి నటించాడని తెలుస్తోంది.

నాగచైతన్య తర్వాత అరవింద్ స్వామి పాత్ర బాగా హైలైట్ అవుతుందట.

Telugu Akkineninaga, Aravind Swamy, Review, Venkat Prabhu, Krithi Shetty, Naga C

అలాగే ఈ సినిమాలో కృతి శెట్టి పాత్రకు సైతం మంచి ప్రాధాన్యత దక్కిందని అంటున్నారు.ఇక సినిమాలో ఆఖరి 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అని.క్లైమాక్స్ వరకు ఆడియన్స్ కి ఒక అద్భుతమైన అనుభూతి కలిగించేలా ఈ చిత్రం వచ్చిందని, కచ్చితంగా క‌స్ట‌డీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలుస్తుంద‌ని ప్రివ్యూ షో చూసిన ప్ర‌తి ఒక్క‌రూ చెప్పార‌ట‌.ఇదే నిజ‌మైతే నాగ చైత‌న్య ఈసారి హిట్ కొట్టి స‌క్సెస్ ట్రాక్ ఎక్క‌డం ఖాయ‌మ‌వుతుంది….ఈ సినిమా తో అయిన నాగ చైతన్యకి తను కోరుకునే హిట్ దక్కుతుందో లేదో చూడాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube