తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.స్పీకర్, ఛైర్మన్ వంటి రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు.
ఏదో ఓ పార్టీ నుంచి గెలిచిన వారేనని తెలిపారు.పదవీకాలం ముగిసిన తరువాత మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని పేర్కొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు అర్ధరహితమని విమర్శించారు.తన గురించి మాట్లాడే నైతిక హక్కు బండి సంజయ్ కు లేదని చెప్పారు.
బీజేపీ తలకిందులుగా తపస్సు చేసినా తెలంగాణలో అధికారంలోకి రాలేదన్నారు.సీఎం కావాలని రేవంత్ రెడ్డి పగటికలలు కంటున్నారని విమర్శలు గుప్పించారు.
కర్ణాటకలో లౌకిక శక్తులు విజయం సాధించాలని వెల్లడించారు.