ఎన్టీఆర్ సరసన శ్రద్ధా కపూర్.. ఆ సినిమాలో కీ రోల్ కోసం ఎంపిక?

‘రౌద్రం రణం రుధిరం” సినిమాతో పాన్ ఇండియా మాత్రమే కాదు వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్ ( NTR ).ఈయన నటించిన ఈ మల్టీ స్టారర్ సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

 Shraddha Kapoor To Act Opposite Jr Ntr, Ntr, Ntr30, Ntr31, Tollywood , Deepika-TeluguStop.com

కొమురం భీమ్ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచి గ్లోబల్ స్టార్ గా గొప్ప పేరు సంపాదించుకున్న ఈ సినిమా తర్వాత భారీ లైనప్ సెట్ చేసుకున్నాడు.

Telugu Ntr, Prashanth Neel, Shraddha Kapoor, Shraddhakapoor-Movie

ప్రస్తుతం ఎన్టీఆర్ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాను చేస్తున్నాడు.NTR30 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తుండగా.అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమా 2024, ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్టు ఎప్పుడో ప్రకటించారు.ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన 31వ సినిమాను కూడా ఎవరితో చేయబోతున్నారో ప్రకటించారు.

Telugu Ntr, Prashanth Neel, Shraddha Kapoor, Shraddhakapoor-Movie

ఈ సినిమా (NTR31) తర్వాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాను కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel ) దర్శకత్వంలో ప్రకటించాడు.ఇండియా – పాకిస్థాన్ బోర్డు నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ భారీ అడ్వెంచర్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నట్టు అఫిషియల్ అనౌన్స్ మెంట్ సైతం వచ్చింది.ఎన్టీఆర్ కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను నీల్ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది.

Telugu Ntr, Prashanth Neel, Shraddha Kapoor, Shraddhakapoor-Movie

కాగా తాజాగా ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ గురించి మరో ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన శ్రద్ధా కపూర్ ( Shraddha Kapoor ) హీరోయిన్ గా నటించనుంది అని తాజాగా బజ్ వినిపిస్తుంది.ఇది వరకు దీపికా పదుకొనె (Deepika Padukone) పేరు వినిపించగా ఇప్పుడు ఈమె ఫిక్స్ అయ్యింది అంటూ వార్తలు వస్తున్నాయిఅయితే ఈ సినిమాలో నటీనటుల ఎంపిక జరగలేదు.

కానీ ఇందులో హీరోయిన్ పాత్ర కీలకం అని అందులో స్టార్ హీరోయిన్ నటిస్తే బాగుంటుంది అని మేకర్స్ భావిస్తున్నట్టు టాక్.ఇందులో ఎంత నిజమో ముందు ముందు తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube