అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ( Naga Chaitanya) ప్రస్తుతం చేస్తున్న రియలిస్టిక్ యాక్షన్ డ్రామా ‘కస్టడీ’.నాగ చైతన్య కెరీర్ ఈ మధ్య కాలంలో బాగానే క్లిక్ అయ్యింది అని అనుకుంటుంటే మళ్ళీ వరుసగా రెండు సినిమాలు ప్లాప్ రావడంతో కొద్దిగా రేసులో వెనుక బడ్డాడు.
అయినా కూడా ఇప్పుడు చేస్తున్న సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.
థాంక్యూ, లాల్ సింగ్ చద్దా వంటి రెండు సినిమాలతో ప్లాప్ అందుకున్న చైతూ నెక్స్ట్ ఆచితూచి సినిమాను ఎంచుకుని చేస్తున్నాడు.ప్రజెంట్ నాగ చైతన్య చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కస్టడీ’ (Custody).తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ( Venkat Prabhu ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య కు జోడీగా కృతి శెట్టి ( Krithi Shetty) హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఈ సినిమాకు నిర్మాతలు కూడా భారీగానే బడ్జెట్ పెడుతున్నారు.నాగ చైతన్య కెరీర్ లో 22వ సినిమాగా తెరకెక్కుతున్న ”కస్టడీ” తమిళ్, తెలుగు ద్విభాషా భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతుంది.
ఈ సినిమాలో నాగ చైతన్య ఫుల్ లెన్త్ పోలీస్ రోల్ లో నటిస్తున్నాడు.ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గత రాత్రి ఘనంగా చేసిన విషయం తెలిసిందే.ఈ వేదికపై నాగ చైతన్య ఈ సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసారు.తన కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా కస్టడీ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు.ఈ సినిమాలో తన పాత్ర పేరు శివ అని ఇది అందరికి బాగా కనెక్ట్ అవుతుంది అంటూ తెలిపాడు.అంతేకాదు ఈ సినిమాకు బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఇళయరాజా, యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అని థియేటర్స్ లో మ్యూజిక్ ను ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని కస్టడీ అన్ని వర్గాల వారిని ఆకట్టు కోవడం ఖాయం అంటూ తెలిపాడు.