కోడిగుడ్డు.( Egg ) ఆరోగ్యపరంగా అపారమైన ప్రయోజనాలను అందించే పోషకాహారాల్లో ఒకటి.
రోజుకు ఒక గుడ్డు తింటే ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని వైద్యులు తరచూ చెబుతూనే ఉంటారు.అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టు సంరక్షణకు కూడా గుడ్డు అద్భుతంగా సహాయపడుతుంది.
ముఖ్యంగా హెయిర్ ఫాల్ సమస్యను కంట్రోల్ చేయడానికి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.ఇప్పుడు చెప్పబోయే విధంగా వారానికి ఒక్కసారి హెయిర్ మాస్క్ ను వేసుకుంటే ఒక్క వెంట్రుక కూడా రాలేదు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఎగ్ మాస్క్( Egg Mask ) ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక అంగుళం అల్లం ముక్క తీసుకుని పొట్టు తొలగించి సన్నగా తరుముకోవాలి.ఈ తురుము నుంచి స్ట్రైనర్ సహాయంతో అల్లం జ్యూస్( Ginger Juice ) ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత రెండు ఎగ్స్ ను తీసుకుని బ్రేక్ చేసి వైట్ ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ లో రెండు ఎగ్ వైట్స్ వేసుకోవాలి.అలాగే మూడు టేబుల్ స్పూన్లు అల్లం జ్యూస్, మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.
వారానికి ఒక్కసారి ఈ హెయిర్ మాస్క్ ను వేసుకుంటే జుట్టు కుదుళ్లు దృఢంగా మారతాయి.హెయిర్ ఫాలో క్రమంగా కంట్రోల్ అవుతుంది.
అదే సమయంలో జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.హెయిర్ ఫాల్ సమస్యను నివారించడానికి ఇది ఉత్తమమైన రెమెడీ గా చెప్పుకోవచ్చు.పైగా ఈ ఎగ్ మాస్క్ ను వేసుకోవడం వల్ల జుట్టు స్మూత్ అండ్ షైనీ( Smooth and Shiny Hair )గా సైతం మెరుస్తుంది.కాబట్టి హెయిర్ ఫాల్ సమస్యతో తీవ్రంగా సతమతం అవుతున్న వారు తప్పకుండా ఈ ఎగ్ మాస్క్ ను వేసుకునేందుకు ప్రయత్నించండి.