ప్రపంచంలో అత్యంత వేగంగా విషయాలపై స్పందించే ప్రధానమంత్రుల్లో మోడీ( PM Modi ) కూడా ఒకరు ఎవరు ఊహించినటువంటి చిన్న చిన్న విషయాలలో కూడా ఒక్కోసారి ఆయన తీసుకునే నిర్ణయాలు సంచలనాత్మకంగా ఉంటాయి.ఎక్కడో మారుమూల పల్లెలో జరిగే విషయాలపై కూడా స్పందించే ఆయన దేశ రాజధాని జంతర్ మంతర్ వేదికగా దేశానికి అంతర్జాతీయ పథకాలు తీసుకువచ్చిన క్రీడాకారుల బాధను పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా మారింది.
ప్రియాంక గాంధీ తప్ప రాజకీయ నాయకులూ కూడా పెద్దగా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు .బిజెపి ఎంపీ ,బాక్సింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్బ్రిజ్ భూషణ్( Brij Bhusan ) ఆర్థికంగానూ సామాజికంగానూ కీలక వ్యక్తి కావడం

రాజకీయ సమీకరణలను ప్రభావితం చేసే వ్యక్తి కావడంతోనే మోడీషాలు అతను జోలికి వెళ్లడం లేదని, ఈ విషయంపై అంతర్జాతీయ మీడియా కూడా దృష్టి పెట్టిన కూడా మోడీలో స్పందన లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఈ విషయంలో స్పందించుకుంటే దేశం పరువు పోయే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నా కూడా పట్టించుకోని వైనం ఆసక్తి కలిగిస్తుంది.అయితే రెజ్లర్ల ఉద్యమానికి( Wrestlers Protest ) సంఘీభావం ప్రకటించడానికి వేల సంఖ్యలో రైతు నాయకులు రావడం ఈ వ్యవహారం ముదురుతుంది అనడానికి సంకేతంగా మారింది… మోడీ ప్రభుత్వం పై నెలలు తరబడి ఉద్యమాలు చేసి తాము అనుకున్నది సాధించిన రైతులు,

ఇప్పుడు ఈ విషయంలో ఎంట్రీ ఇవ్వడంతో మోడీ సర్కార్ స్పందించక తప్పని పరిస్థితులు ఎదురవుతాయని అందరూ అంచనా వేస్తున్నారు .కారణాలు ఏమైనా దేశాన్ని గర్వించేలా చేసి భారత పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎగరేసిన క్రీడాకారుల పట్ల ప్రభుత్వ వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదం అవుతుంది న్యాయన్యాయాలు పక్కన పడితే వేగంగా విచారణ చేసి నిజానిజాలు బయటపెట్టాల్సిన బాధ్యత అయితే కేంద్ర ప్రభుత్వంపై ఉంది కానీ ఇలా పట్టించుకోనట్లుగా వ్యవహరించడం బావిష్యత్తులో పతకాలు సాదించాలనుకునే ఎంతో మంది క్రీడాకారులకు తప్పుడు సంకేతాలు ఇస్తుందని అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ విషయంలో వేగంగా విచారణ జరిపి దోషులను శిక్షించాలని చాలామంది కోరుకుంటున్నారు.







