Director Atlee: కొడుకు పేరు ప్రకటించిన దర్శకుడు అట్లీ.. షాక్ అవుతున్న నెటిజన్లు.. కారణం అదే?

తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ ( Director Atlee )గురించి మనందరికీ తెలిసిందే.పాన్ ఇండియా వైడ్ గా ఉండే స్టార్ డైరెక్టర్స్ లో డైరెక్టర్ అట్లీ కూడా ఒకరు.

 Jawan Director Atlee Revils His Son Name-TeluguStop.com

ఇప్పటివరకు తమిళ సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలకు దర్శకత్వం వహించి డైరెక్టర్ గా మంచి గుర్తింపు ఏర్పరచుకున్న అట్లీ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.సల్మాన్ ఖాన్ ,నయనతార( Salman Khan , Nayantara ) కలిసి నటించబోతున్న సినిమాకు దర్శకత్వం వహించనున్నారు అట్లీ.

ఇందులో విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) కీలకపాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదల చేయనున్నట్లు తాజాగా వెల్లడించారు.

ఇకపోతే అట్లీ నటి ప్రియా మోహన్( Priya Mohan ) ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.2014లో ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు.ఈ దంపతులకు పండంటి మగ బిడ్డ కూడా జన్మించాడు.ఇప్పటికే ఈ విషయాన్ని దర్శకుడు అట్లీ సోషల్ మీడియా వేదికగా తెలిపిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా డైరెక్టర్ అట్లీ తమ కుమారుడి పేరుని కూడా సోషల్ మీడియా వేదికగా తెలిపారు.ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ.

తమ కుమారుడికి మీర్( Meer ) అని పేరు పెట్టినట్లు తెలిపారు.మా లిటిల్‌ ఏంజెల్‌ పేరును తెలియజేస్తుండటం చాలా సంతోషంగా ఉందంటూ ప్రియా మోహన్ ట్వీట్ చేసింది.

మీర్‌ తో అట్లీ దంపతులు కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.చాలామంది ఆ పేరు అర్థం ఏంటి అంటూ సోషల్ మీడియా వేదికగా అట్లీ దంపతులను ప్రశ్నిస్తున్నారు.చాలామంది అదేం పేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇది ఇలా ఉంటే దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్న జవాన్ సినిమా షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే.

ఇందులో న‌య‌న‌తార ఇన్వెస్టిగేటివ్ ఆఫీస‌ర్‌గా న‌టించ‌నున్నట్టు తెలుస్తోంది.అలాగే ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube