పెళ్లిని మధ్యలో ఆపిన వరుడు.. పెళ్లికూతురు చెల్లిని ప్రేమిస్తున్నానంటూ ట్విస్ట్!

సాధారణంగా సినిమాల్లోని కామెడీ పెళ్లిళ్లలో వరుడు వధువుని కాకుండా తల్లిని లేదా చెల్లిని చూసి మనసు పారేసుకోవడం మనం చూస్తుంటాం.అయితే ఇలాంటి సంఘటనలు కేవలం సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా అప్పుడప్పుడు చోటు చేసుకుంటాయి.

 Bihar Groom Stops Wedding Says He Loves Brides Sister Details, Marriage, Wedding-TeluguStop.com

తాజాగా బిహార్‌లోని( Bihar ) సరన్‌ జిల్లాలో ఇలాంటి వింత సంఘటన ఒకటి జరిగింది.రాజేష్ కుమార్( Rajesh Kumar ) అనే వరుడు ఇటీవల రింకు కుమారిని( Rinku Kumari ) పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు.

ఇక తాళి కట్టడమే ఆలస్యం అనుకోగా ఒక కొత్త ట్విస్ట్ వచ్చి పడింది.

ఈ వివాహ వేడుకలో రాజేష్‌కు రింకూ సోదరి పుతుల్ నుంచి కాల్ వచ్చింది, రాజేష్ తన అక్కను పెళ్లి చేసుకుంటే తాను భవనంపై నుంచి దూకుతానని బెదిరించింది.దీంతో రాజేష్ పెళ్లిని ఆపివేసి రింకూతో కాకుండా తాను పుతుల్‌తో ప్రేమలో ఉన్నానని బాంబ్‌ పేల్చాడు.ఈ మాట విన్న అతిథులు అందరూ కూడా నోరెళ్లబెట్టారు.

కుటుంబసభ్యుల ఈ సంగతి తెలిసి ఏం చేయాలో అర్థం కాక తల గీక్కున్నారు.కొంత సమయంలోనే ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.

ఆపై శాంతియుత చర్చలు ప్రారంభించారు.రింకూతో తన పెళ్లి నిశ్చయించడానికి ముందే పుతుల్‌ను కలిశానని రాజేష్ ఇరు కుటుంబాలకు వివరించాడు.తాము ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డామని చెప్పుకొచ్చారు.అక్క రింకూతో కాకుండా అతను ఆమె చెల్లితోనే జీవితం పంచుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.ఈ జంట ప్రేమకథను విన్న కుటుంబాలు చివరికి రాజేష్, పుతుల్‌లను వివాహం చేయించేందుకు సిద్ధమయ్యాయి.ఏదేమైనా ఈ వ్యవహారం నెట్టింట అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube