పుష్ప 1( Pushpa ) తో సూపర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్( Allu Arjun ) పుష్ప 2 తో మరో సంచలనానికి సిద్ధమయ్యాడు.సుకుమార్ పుష్ప 2 ని అంచనాలకు మించి ఉండేలా ప్రతి యాస్పెక్ట్ లో కష్టపడుతున్నాడు.
శాంపిల్ గా వదిలిన గ్లింప్స్ కే సూపర్ రెస్పాన్స్ రాగా పుష్ప 2 కోసం ఆడియన్స్ అంత ఈగర్ గా ఎదుచూస్తున్నారో దీనికి వచ్చిన రెస్పాన్స్ ని బట్టు చెప్పొచ్చు.

ఈ క్రమంలో పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ అసలైతే సందీప్ వంగా( Sandeep Vanga )తో సినిమా ప్లాన్ చేశాడు.సందీప్ వంగ ప్రభాస్ తో స్పిరిట్ పూర్తయ్యాక అల్లు అర్జున్ తో చేయాల్సి ఉంది.అందుకే సందీప్ సినిమా పక్కన పెట్టి పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రం( Trivikram ) తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట.
త్రివిక్రం ప్రస్తుతం మహేష్ తో సినిమా చేస్తున్నారు.

ఆ సినిమా తర్వాత బన్నీతోనే సినిమా ఉంటుందని తెలుస్తుంది.త్రివిక్రం అల్లు అర్జున్ ఇద్దరు కలిసి హ్యాట్రిక్ సినిమాలు తీసి హిట్ అందుకున్నారు.ఈసారి డబుల్ హ్యాట్రిక్ ఖాతా తెరవాలని చూస్తున్నారు.
అల్లు అర్జున్ పుష్ప తో పాన్ ఇండియా స్టార్ కాగా అతనితో పాన్ ఇండియా సినిమానే ప్లాన్ చేస్తున్నారట త్రివిక్రం.ఈ కాంబో సినిమా అంటే అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి.







