సూర్యాపేట జిల్లా: శనివారం జిల్లా కేంద్రంలో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న మున్సిపాలిటీ ఉద్యోగి( Municipality employee ) భిక్షంపై అక్రమ నిర్మాణం చేపడుతున్న భద్రయ్య అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేసిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో గాయపడ్డ మున్సిపాలిటీ ఉద్యోగిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
సూర్యాపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉద్యోగి భిక్షం ను జిల్లా కలెక్టర్ వెంకట్రావు( Venkata Rao ) ఆదివారం పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పేట మున్సిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి,ప్రసాద్ ( Prasad )తదితరులు పాల్గొన్నారు.