ఆధార్ కార్డుకు( Aadhaar Card ) మొబైల్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా.ఒకవేళ ఏ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డుకు లింక్ అయ్యిందో మీకు తెలియదా.
అసలు ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ ఎలా లింక్ చేసుకోవాలి అనే వివరాలు మొత్తం తెలుసుకుందాం.UADAI అధికారిక వెబ్సైట్ https://myaadhaar,uidai.gov.in/ లో కానీ mAadhaar యాప్ లోకి వెళ్లి ఆధార్ కు మొబైల్ లింక్ అయ్యిందా లేదా అని వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చు.ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే ఆ నెంబర్ స్క్రీన్ పై కనిపిస్తుంది.ఒకవేళ ఎటువంటి నెంబర్ స్క్రీన్ పై కనిపించకుంటే ఆధార్ కార్డుకు ఎటువంటి మొబైల్ నెంబర్ లింక్ కానట్టే.ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయడానికి కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ( Ministry of IT ) ఓ ప్రకటన విడుదల చేసింది.

మై ఆధార్ పోర్టల్( My Aadhaar Portal ) లేదా mAadhaar యాప్ లో ముందుగా వెరిఫై చేసుకోవాలి.సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్ లోని చివరి మూడు అంకెలను ఎంటర్ చేయాలి.తర్వాత మొబైల్ ఫోన్ అప్డేట్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూద్దాం.ముందుగా uidai.gov.in లో లాగిన్ అయ్యి ఎన్రోల్మెంట్ సెంటర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.తర్వాత మీకు సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి.అనంతరం ఆధార్ కార్డు సెంటర్కు వెళ్లి మొబైల్ నెంబర్ అప్డేట్ కు సంబంధించిన ఫామ్ తీసుకొని ఫిల్ చేయాలి.ఆన్లైన్లో మీ వివరాలు ఎంటర్ చేసిన తర్వాత ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు.
తర్వాత అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్( Update Request No ) (URN) అనే స్లిప్ ఇస్తారు.ఈ ప్రాసెస్ చేయడానికి రూ.50 ఫీజు తీసుకుంటారు.ఇక 90 రోజుల్లో మొబైల్ నెంబర్ అప్డేట్ అయ్యి ఆధార్ కార్డు లింక్ అవుతుంది.
URN ద్వారా ఆధార్ కార్డ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.ఆధార్ కు ఇచ్చిన అప్డేట్ వివరాలు ఇంట్లో కూర్చునే తెలుసుకోవచ్చు.
కానీ ఆధార్ కు సంబంధించన అప్డేట్స్ చేయాలంటే ఫింగర్ ప్రింట్స్ తప్పనిసరి కావడంతో దగ్గర్లో ఉండే ఆధార్ సెంటర్ కు వెళ్లాల్సిందే.