మణిపూర్ హింసాకాండ నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగు వారి తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది.ఇందులో భాగంగా మరికాసేపటిలో మణిపూర్ నుంచి హైదరాబాద్ కు రెండు ప్రత్యేక విమానాలు రానున్నాయి.
చదువు కోసం వెళ్లిన సుమారు 250 మంది తెలంగాణ విద్యార్థులతో పాటు వివిధ పనుల కోసం వెళ్లిన కొందరు పౌరులు అక్కడ చిక్కుకున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో వారిని సురక్షితంగా స్వరాష్ట్రానికి తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
ఇందులో భాగంగానే రెండు విమానాల్లో విద్యార్థులు, పౌరులు హైదరాబాద్ కు చేరుకోనున్నారు.