తారక్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పదా.. బర్త్ డే రోజు కేవలం ఆ అప్డేట్ మాత్రమేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( NTR ) టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”NTR30”.ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ (RRR) వంటి సినిమాతో సంచలనం సృష్టించిన తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 Ntr And Koratala Siva Ntr30 Movie Latest Update, Ntr30, Ntr, Koratala Shiva, Ntr-TeluguStop.com

ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అందులోను వీరి కాంబోలో ఇప్పటికే జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ సినిమా వచ్చింది.

మళ్ళీ ఇదే కాంబో రిపీట్ కాబోతుండడం ఈసారి పాన్ ఇండియాగా తెరకెక్కుతుండటంతో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.ఇక ఈ పాన్ ఇండియన్ సినిమా నుండి ఏదొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వస్తూనే ఉంది.

తాజాగా మరో అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది.

Telugu Janhvi Kapoor, Koratala Shiva, Ntr-Movie

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా నుండి మే 20 తారక్ పుట్టిన రోజు( NTR Birthday )న అదిరిపోయే అప్డేట్ వస్తుంది అని తారక్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ బర్త్ డే అప్డేట్ గురించి ఇప్పుడొక వార్త వినిపిస్తుంది.పుట్టిన రోజున ఈ సినిమా గ్లిమ్స్ టీజర్ ను ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

కానీ ఆ రోజు అలాంటి గ్లిమ్స్ ఏమీ రావడం లేదట.కేవలం ఒక పోస్టర్ మాత్రమే రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.

దీనిపై ముందు ముందు మరింత క్లారిటీ తెలియాల్సి ఉంది.

Telugu Janhvi Kapoor, Koratala Shiva, Ntr-Movie

మరి కొరటాల( Koratala Siva ) ఈసారి తారక్ ను ఎంత కొత్తగా ఇంట్రెస్టింగ్ అండ్ పవర్ ఫుల్ గా చూపిస్తాడో వేచి చూడాల్సిందే.ఇక ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ( Janhvi Kapoor ) తెలుగులోకి అడుగు పెట్టబోతోంది.అలాగే విలన్ రోల్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా.

యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్నారు.అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుంది అని ఇప్పటికే అఫిషియల్ గా ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube