Anjali : వామ్మో.. ఆ స్టార్ హీరో కొడుకు అంజలిని నమ్మించి మోసం చేశాడా?

సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ లు అప్పుడప్పుడు మోసపోతూ ఉంటారు.ముఖ్యంగా లవ్, డేటింగ్ విషయంలో బాగా మోసపోతూ ఉంటారు.

 Actress Anjali Love Affair Details-TeluguStop.com

కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్ళ కెరీర్ కూడా నాశనం అవుతుంది.అందుకే కొంతమంది హీరోయిన్లు మంచి హోదాలో ఉండగానే ఒకేసారి డౌన్ అవుతారు.

ఇప్పటికి చాలామంది హీరోయిన్లు వ్యక్తిగత విషయంలో కొన్ని రకాల మోసాలకు గురై సినిమాలకు బ్రేక్ ఇచ్చిన వాళ్లు కూడా ఉన్నారు.మరికొంతమంది వాటిని తట్టుకొని ఇండస్ట్రీలో కూడా కొనసాగుతున్నారు.

అందులో ఒకరు హీరోయిన్ అంజలి అని చెప్పాలి.

Telugu Actressanjali, Anjali, Anjali Love, Horror, Kollywood, Senior Heroes, Tol

టాలీవుడ్ నటి తెలుగు అమ్మాయి అంజలి( Anjali ) గురించి తెలుగు ప్రేక్షకులందరికి బాగా పరిచయమని చెప్పాలి.తన నటనతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.కాస్త లావుగా ఉన్నా కూడా తన అందాలతో అందర్నీ ఆకట్టుకుంది.

ఇక నటన పరంగా తన పాత్రకు ప్రాణం పోసినట్లుగా నటిస్తుంది.తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా నటించింది.

కానీ తెలుగు సినీ పరిశ్రమ( Tollywood )లో మాత్రం అంతా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది అంజలి.ఇక 2006లో ఫోటో సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన అంజలి ఆ తర్వాత ఏడాది తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

ఇక అక్కడే వరుస సినిమాలలో సెటిలైన మళ్లీ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు( Seethammavakitlo Sirimalle Chettu ) సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రి ఇచ్చింది.

Telugu Actressanjali, Anjali, Anjali Love, Horror, Kollywood, Senior Heroes, Tol

ఇక ఈ సినిమాతో మంచి గుర్తింపు అందుకుంది.తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు రాగా మళ్ళీ అంత సక్సెస్ అందుకోలేకపోయింది.ఇక వకీల్ సాబ్ సినిమాలో నటించగా తన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.

కానీ ఆఫర్లు మాత్రం అంతగా రాలేకపోయాయి.ఇక ఎన్నోసార్లు అంజలి టాలీవుడ్ కు రీ ఎంట్రీ కూడా ఇవ్వగా సక్సెస్ లు రాకపోవడానికి కారణం మాత్రం మరొకటి ఉందని చెప్పాలి.

తను తక్కువ సమయంలోనే సీనియర్ హీరోల సరసన నటించడంతో డిమాండ్ తగ్గింది.అంతేకాకుండా తర్వాత చేయవలసిన హారర్ సినిమాలు( Horror Movies ) కూడా ముందుగానే చేసింది.

పైగా సినిమాల విషయంలో తొందర పడటం వల్ల తనకు హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి.ఇక అవకాశాలు రాకపోవడంతో తను గ్లామర్ షో కూడా చేయటానికి సిద్ధమయింది.

ఏకంగా పొట్టి పొట్టి బట్టలు ధరించి బాగా డోస్ పెంచి తన అందాలను బయటకు వేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

Telugu Actressanjali, Anjali, Anjali Love, Horror, Kollywood, Senior Heroes, Tol

అయినా కూడా అవకాశాలు అందుకోవట్లేదు అని తెలుస్తుంది.పైగా ఈ మధ్య కొత్త కొత్త హీరోయిన్లు రావడం వల్ల కూడా తనకు అవకాశాలు రావట్లేదు అని అర్థమవుతుంది.అయితే అంజలి గతంలో మోసపోయినట్లు తెలిసింది.

ఒక స్టార్ హీరో కొడుకు తనను నమ్మించి మోసం చేశాడట.ఒక హోదా లో ఉన్నప్పుడు ఒక స్టార్ హీరో కొడుకు తనను లవ్ పేరుతో వాడుకొని వదిలేసాడు అని తెలిసింది.

కొంతకాలం ప్రేమించుకున్న వీరు ఇప్పుడు ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఉంటున్నారు.

అప్పట్లో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి.

ఇక ఇప్పుడు అవన్నీ మర్చిపోయి తన లైఫ్ ఎంటో తాను చూసుకుంటుంది అంజలి.ఇక ప్రస్తుతం టాలీవుడ్( Tollywood ) లో ఓ సినిమాలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.

అంతేకాకుండా మలయాళం, కన్నడ భాషల్లో కూడా బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube