ప్రస్తుత సమాజంలో మానవత్వం అనే మాటకు చోటు కరువైంది.వయస్సుతో సంబంధం లేకుండా లైంగిక దాడులులకు పాల్పడుతున్నారు.
ఒంటరిగా ఆడవాళ్లు తమ పనులు చేసుకోవాలంటే ఇటువంటి కామాంధుల నుండి ఎప్పుడో ఒకసారి ముప్పు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి.ఓ 81 ఏళ్ల వృద్ధుడు చాక్లెట్ ఆశ చూపించి నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే అతనిని అరెస్టు చేశారు.వివరాల్లోకెళితే.
పశ్చిమబెంగాల్లో( West Bengal )ని మాల్దా జిల్లాలో శుక్రవారం సాయంత్రం నాలుగు ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన 81 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.ఇతనిని బంకిమ్ చంద్ర రాయ్ గా పోలీసులు గుర్తించారు.
అసలు ఏం జరిగిందంటే.? గజోల్ ప్రాంతంలో తమ ఇంటి ఎదుట బాలిక శుక్రవారం సాయంత్రం ఆడుకుంటూ ఉండగా.బంకిమ్ చంద్ర రాయ్ అనే 81 ఏళ్ళ వ్యక్తి చాక్లెట్ ఆశ చూపించి ఆ బాలికను పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు.ఆ ప్రాంతంలో ఎవరు లేకపోవడంతో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఆ బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి తన ప్రైవేట్ భాగాలలో నొప్పి ఉందని తల్లిదండ్రులకు తెలిపింది.

తల్లిదండ్రులు ఆ బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా బాలిక లైంగిక వేధింపులకు గురైందని, ప్రస్తుతం బాలిక పరిస్థితి కాస్త విషమంగానే ఉందని వైద్యులు తెలిపి, కు సమాచారం అందించారు.పోలీసులు ఘటన గురించి వివరాలు తెలుసుకొని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు ( Police )బంకిమ్ చంద్ర రాయ్ ను అరెస్టు చేసి విచారించగా తానే దారుణానికి పాల్పడినట్టు అంగీకరించాడు.నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని, అతనిపై పోక్సో చట్టం( POCSO ) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.







