కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీల ప్రచార హోరు కొనసాగుతోంది.ఇందులో భాగంగా బెంగళూరులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్ షోలో పాల్గొన్నారు.
రెండో రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఈ రోడ్ షో కెంపే గౌడ విగ్రహం నుంచి ఎంజీ రోడ్ వరకు కొనసాగింది.మధ్యాహ్నం శివమొగ్గ రూరల్ తో పాటు నంజన్ గుడ్ లో మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
అటు బెంగళూరు శివాజీ నగర్ లో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బహిరంగ సభ ఉండనుంది.కాగా రేపటితో కన్నడలో ఎన్నికల ప్రచారానికి గడువు ముగియనున్న సంగతి తెలిసిందే.







