ఉప్పెన ( Uppena )సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి కృతి శెట్టి( Krithi Shetty ). మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అనంతరం నాగచైతన్య హీరోగా నటించిన బంగార్రాజు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది ఇలా వరుసగా మూడు హిట్ సినిమాలు పడటంతో ఈమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి.

అయితే ఈ సినిమాల తర్వాత కృతి శెట్టి నటించిన ఆ అమ్మాయి గురించి చెప్పాలి, మాచర్ల నియోజకవర్గం, ది వారియర్ మూడు సినిమాలు కూడా వరుసగా ఫ్లాప్ అయ్యాయి.ఇలా మూడు సక్సెస్ సినిమాలు మూడు డిజాస్టర్ సినిమాలు ఎదుర్కొన్నటువంటి కృతి శెట్టి తాజాగా మరోసారి నాగచైతన్య( Naga chaitanya ) హీరోగా తెరకెక్కిన కస్టడీ సినిమా( Custody Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కానుంది.ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి కృతి శెట్టి తన గురించి తన సినీ కెరియర్ గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు.తనకు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగడం తర్వాత దర్శకత్వం కూడా చేయాలని ఉందని తెలియజేశారు.అందుకే తాను డైరెక్టర్ ఏ సన్నివేశాలను ఎలా చేస్తున్నారనే విషయాలను గమనిస్తూ ఉంటానని తెలిపారు.తన ఫ్లాప్ సినిమాల గురించి మాట్లాడుతూ…ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత హిట్ సినిమాలు ఫ్లాప్ సినిమాలు రావడం సర్వసాధారణం ఈ ప్రయాణంలో వాటన్నింటిని ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు.
అయితే ఆ అపజయాలను విశ్లేషించుకుని ఇకపై అలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటూ ముందడుగు వేస్తున్నానని తెలిపారు.







