బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ( Shah Rukh Khan ) ఇప్పుడు కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్నాడు.అయితే ఎన్ని సినిమాలు చేస్తున్న గత దశాబ్దంగా సూపర్ హిట్ అనేది సాధించలేక పోయాడు.
కానీ షారుఖ్ నటించిన ‘పఠాన్’ సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా అదిరిపోయే హిట్ అందించాడు.

ఈ సినిమాతో కంబ్యాక్ అయ్యిన షారుఖ్ ఖాన్ ఇప్పుడు నెక్స్ట్ చేస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ప్రస్తుతం షారుఖ్ ఖాన్ నటిస్తున్న సినిమాల్లో ‘జవాన్’ ( Jawan ) ఒకటి.ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ( Atlee Kumar ) డైరెక్ట్ చేస్తున్నాడు.అయితే ఈ సినిమా గత కొన్ని రోజులుగా షూటింగ్ జరుపు కుంటుంది.
ఇప్పటికే షూట్ చివరి దశకు చేరుకుంది.

దీంతో ఈ సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ అంతా అనుకున్నారు.కానీ తాజాగా ఈ సినిమా వాయిదా వేసి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. జూన్ 2న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
కానీ జూన్ 2న వాయిదా వేసి ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు.ఈ సినిమాను సెప్టెంబర్ 7న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు.అఫిషియల్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా వేయడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు.ఈ సినిమాలో నయనతార( Nayantara ) హీరోయిన్ గా నటిస్తుంది.
అలాగే దీపికా పదుకొనె( Deepika Padukone ) అతిథి పాత్రలో నటిస్తుంది.అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.
చూడాలి ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో.







