సాయి ధరమ్ తేజ( Sai Dharam Tej ) హీరో గా కార్తిక్ దండు డైరెక్షన్ లో వచ్చిన సినిమా విరూపాక్ష ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది అందులో భాగంగానే ఈ సినిమా డైరెక్టర్ కి ప్రస్తుతం చాలా మంది హీరో ల నుంచి చాలా ఆఫర్స్ వస్తున్నాయి.కానీ ఆయన ఎవరితో సినిమా చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది…

అయితే కార్తిక్ దండు కి విరూపాక్ష( Virupaksha ) రెండవ సినిమా మొదటి సినిమా ఏంటంటే నవదీప్, నవీన్ చంద్ర మెయిన్ లీడ్ లో వచ్చిన భమ్ భోలే నాథ్ అనే సినిమా…ఈ సినిమా వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది… దాంతో కొద్ది సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ఇప్పుడు విరూపాక్ష సినిమాతో వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు కార్తిక్ దండు…సుకుమార్ ఇచ్చిన స్క్రీన్ ప్లే కూడా ఈ సినిమా కి బాగా ప్లస్ అయింది…ప్రస్తుతం కార్తిక్ దండు( Karthik Dandu ) తన నెక్స్ట్ సినిమా నాగ చైతన్య తో చేయబోతున్నట్టు గా తెలుస్తుంది.అందులో భాగంగానే ఆయన నాగ చైతన్య కి కూడా ఒక కథ వినిపించాడట కానీ నాగ చైతన్య( Naga Chaitanya ) నటించిన కస్టడీ సినిమా ఇంకా కొద్ది రోజుల్లో రిలీజ్ ఉండటంతో ఆ సినిమా రిలీజ్ అయ్యాక నెక్స్ట్ సినిమా ప్లాన్ చేసుకుందాం అని అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది…

చూడాలి మరి నాగ చైతన్య కోసం డైరెక్టర్ వేచి ఉంటాడా లేక వేరే వాళ్ళతో సినిమా చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది…అలాగే కార్తిక్ దండు కి తమిళ్ సూపర్ స్టార్ అయిన ధనుష్ నుంచి ఒక ఆఫర్ వచ్చిందట ప్రస్తుతం ధనుష్( Dhanush ) తెలుగు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టినట్టు తెలుస్తుంది రీసెంట్ గా సార్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఆయన శేఖర్ కమ్ముల తో ఒక సినిమా చేస్తున్నాడు అలాగే కార్తిక్ ని కూడా లైన్ పెడుతున్నట్టు తెలుస్తుంది…








